పెన్షన్ పై చంద్రబాబు కుట్ర.. వైసీపీ ధ్వజం

సీఎం జగన్ పై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు వైసీపీ నేతలు. వారి ఒత్తిడికి తలొగ్గి వాలంటీర్లు సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు.

Advertisement
Update:2024-03-31 07:29 IST

గతంలో స్థానిక ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా పెట్టించారు. అప్పుడు కూడా అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సచివాలయాలకు వెళ్లి క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడ్డారు. ఇప్పుడు కూడా ఎన్నికల సీజన్లో టీడీపీ అనుకూల సంస్థతో ఈసీకి ఫిర్యాదు చేయించారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టారు. ఇది నెలరోజుల సమస్య కాదు. ఏప్రిల్, మే.. రిజల్ట్ జూన్ లో కాబట్టి.. అప్పుడు కూడా వాలంటీర్లను పెన్షన్లకు దూరంగా పెట్టే నిర్ణయం ఇది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైసీపీ నేతలు స్వాగతించలేదు. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు ఇచ్చే విధానం పునరుద్ధరించాలని, వాలంటీర్లకే ఆ బాధ్యత అప్పగించాలని వారు కోరుతున్నారు. ఈసీ నిర్ణయాన్ని సమీక్షించాలని అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

వాలంటీర్ల సేవలు నిలిపివేయించిన నీఛుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు మరో మంత్రి కారుమూరి. చంద్రబాబు పెత్తందారీ పోకడలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఎంపీ కేశినేని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. వాలంటీర్ల విధులను నియంత్రించడమంటే వారి ద్వారా ప్రయోజనాలు పొందుతున్న లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమేనని విమర్శించారు ఎమ్మెల్యే కన్నబాబు. వాలంటీర్లను నియంత్రించేందుకు చంద్రబాబు అండ్‌కో చేసిన ప్రయత్నాలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పారాయన. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, పవన్‌ వాలంటీర్లపై దుర్మార్గమైన కామెంట్లు చేశారని, తాజాగా ఎన్నికల కమిషన్‌కు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై పిర్యాదు చేశారని ఆరోపించారు. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. వాలంటీర్లను నియంత్రిస్తే వైసీపీని నియంత్రించామని అనుకోవడం చంద్రబాబు భ్రమ అన్నారు కన్నబాబు.

సీఎం జగన్ పై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు వైసీపీ నేతలు. వారి ఒత్తిడికి తలొగ్గి వాలంటీర్లు సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. కుట్రలతో చంద్రబాబు వాలంటీర్లను బలి చేయాలనుకున్నారని, కానీ.. చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో అవ్వాతాతలు, వికలాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు బలవుతున్నారని వారు వివరించారు. ఇప్పటికైనా ఈసీ తన నిర్ణయాన్ని సమీక్షించాలని, వృద్ధులు, వికలాంగులకు అవస్థలు లేకుండా చూడాలని కోరారు వైసీపీ నేతలు.   

Tags:    
Advertisement

Similar News