ఆ నిబంధనల వల్లే చదువులు పెరిగి, బాల్య వివాహాలు తగ్గుముఖం
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు పదో తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా, వరుడుకి 21 ఏళ్ళుగా నిర్ధేశించిన జగన్ ప్రభుత్వం.. పిల్లలు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది.
అక్టోబర్- డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమచేశారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ తోఫా కింద ఇప్పటి వరకు మొత్తం 56,194 మంది లబ్ధిదారులకు రూ.467.27 కోట్లు అందించారు. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో 17,709 మంది అర్హులకు రూ.68.68 కోట్లు ఇవ్వకుండా వదిలేశారు. జగన్ ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఆర్థిక సాయాన్ని దాదాపుగా రెండింతలు చేసి అందిస్తోంది.
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి, తమ సామాజిక బాధ్యత నిర్వహింసేందుకు అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యానమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు పదో తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా, వరుడుకి 21 ఏళ్ళుగా నిర్ధేశించిన జగన్ ప్రభుత్వం.. పిల్లలు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది. జగన్ ప్రభుత్వం 1వ తరగతి నుండి అప్పటికే ఏటా అందిస్తున్న రూ. 15,000 జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్ వరకూ కూడా ఇస్తుండటంతో వారికి 17 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి వారి ఇంటర్ చదువు కూడా పూర్తవుతుంది.
కళ్యాణమస్తు, షాదీ తోఫాలలో వధువుకు 18 ఏళ్ళు, వరునికి 21 ఏళ్ళ వయో పరిమితి ఉండటం, మన ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా రూ. 20,000 వరకు ఆర్థిక సాయం ఎలాగూ అందిస్తుండడంతో వారు గ్రాడ్యుయేషన్ లో చేరుతారు, పూర్తి చేస్తారన్న నమ్మకంతో పాటు బాల్య వివాహాలకు కూడా అడ్డుకట్ట వేయడం జరుగుతుంది.
కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద లబ్ధిదారులకు అందించిన సాయం వివరాలు..
- ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 40,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
- ఎస్సీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
- ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
- ఎస్టీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
- బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 35,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 50,000
- బీసీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000
- మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషా గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
- విభిన్న ప్రతిభావంతులు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 1,00,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,50,000
- భవన, ఇతర నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 20,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 40,000
- జమ చేసిన తేదీ (10.02.2023) లబ్ధిదారులు 4,536, అందించిన మొత్తం రూ. కోట్లలో 38.18 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్ – డిసెంబర్ 2022)
- జమ చేసిన తేదీ (05.05.2023) లబ్ధిదారులు 12,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 87.32 (వివాహం జరిగిన త్రైమాసికం జనవరి-మార్చి 2023)
- జమ చేసిన తేదీ (09.08.2023) లబ్ధిదారులు 18,883, అందించిన మొత్తం రూ. కోట్లలో 141.60 (వివాహం జరిగిన త్రైమాసికం ఏప్రిల్-జూన్ 2023)
- జమ చేసిన తేదీ (23.11.2023) లబ్ధిదారులు 10,511, అందించిన మొత్తం రూ. కోట్లలో 81.64 (వివాహం జరిగిన త్రైమాసికం జులై-సెప్టెంబర్ 2023)
- జమ చేసిన తేదీ (20.02.2024) లబ్ధిదారులు 10,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 78.53 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ 2023)
మొత్తం లబ్ధిదారులు 56,194 అందించిన మొత్తం రూ. కోట్లలో 427.27