అనుకున్నది సాధించిన షర్మిల..

గతంలో తెలంగాణలో కూడా ఇలాగే నిరసనలు, అరెస్ట్ లు అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేశారు షర్మిల. సేమ్ ఫార్ములా ఏపీలో కూడా ప్రయోగించారు.

Advertisement
Update:2024-02-22 17:45 IST

"అన్న పాలనలో చెల్లెలు అరెస్ట్.." ఎల్లో మీడియా అడక్కుండానే వారు కోరుకునే హెడ్డింగ్ ఇచ్చారు షర్మిల. మెగా డీఎస్సీ పేరుతో హడావిడి చేస్తూ చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన ఆమె ఈరోజు అరెస్ట్ అయ్యారు. ర్యాలీగా సచివాలయానికి బయలుదేరిన ఆమె, మధ్యలో అవసరం లేకుండానే రోడ్డుపై బైఠాయించి రాద్ధాంతం చేశారు. చివరకు పోలీసులు అరెస్ట్ చేయడంతో షర్మిల తాను అనుకున్నది సాధించినట్టయింది. ఎల్లో మీడియా ఈ వ్యవహారంలో అనుకున్నదానికంటే రెట్టింపు రచ్చ మొదలు పెట్టింది.

గతంలో తెలంగాణలో కూడా ఇలాగే నిరసనలు, అరెస్ట్ లు అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేశారు షర్మిల. పోలీసులతో గొడవపడుతూ రచ్చ చేశారు. సేమ్ ఫార్ములా ఏపీలో కూడా ప్రయోగించారు. ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన, బీజేపీలో.. ఏ ఒక్కరూ రోడ్డుపై గొడవ చేసి అరెస్ట్ కాలేదు. కానీ షర్మిల మాత్రం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే కావాల్సినంత హడావిడి చేశాారు. చివరకు అరెస్ట్ అయ్యారు.

డీఎస్సీపై గొడవ ఎందుకు..?

ఏపీ ప్రభుత్వం ఇటీవల 6వేల పోస్ట్ లతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ పోస్ట్ లు సరిపోవని, మెగా డీఎస్సీ వేయాల్సిందేనని పట్టుబట్టాయి ప్రతిపక్షాలు. తాము అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ వేస్తామంటూ లోకేష్ హామీ ఇచ్చారు. కానీ షర్మిల మాత్రం యువతను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు రచ్చ చేసి అరెస్ట్ అయ్యారు.

ఆర్కే వెళ్లిపోవడంపై మాట దాటవేత..

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి తిరిగి వైసీపీలో చేరడంపై షర్మిల స్పందించలేదు. ఆ వ్యవహారంపై శుక్రవారం స్పందిస్తానంటూ మాటదాటవేశారు షర్మిల. ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నిరోజులు హడావిడి నడిచింది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. ఆర్కేకి కూడా తత్వం బోధపడి తిరిగి సీఎం జగన్ వద్దకు చేరుకున్నారు. ఈ దశలో షర్మిల మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేందుకు ఇలా నిరసనలతో సీన్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. 

Tags:    
Advertisement

Similar News