విశాఖే రాజధాని.. ప్రమాణస్వీకారం అక్కడే - జగన్‌

విశాఖను పరిపాలన రాజధానిగా చేసి సీఎంగా బాధ్యతలు తీసుకుంటానన్నారు. ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నిక‌ల ప్ర‌చార రోడ్ షోలో ఈ మేరకు ప్రకటన చేశారు జగన్.

Advertisement
Update:2024-05-07 19:21 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి విశాఖపట్నంలోనే ప్రమాణస్వీకారం చేస్తానన్నారు వైసీపీ అధినేత జగన్. విశాఖను పరిపాలన రాజధానిగా చేసి సీఎంగా బాధ్యతలు తీసుకుంటానన్నారు. ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నిక‌ల ప్ర‌చార రోడ్ షోలో ఈ మేరకు ప్రకటన చేశారు జగన్.

ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలను ఆరు జిల్లాలు చేసింది తానేనన్నారు. ముగ్గురు కలెక్టర్లు, ముగ్గురు ఎస్పీలున్న చోట ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలను నియమించి అధికార వికేంద్రీకరణతో పాలనను పేదవాడి చెంతకు చేర్చింది 59 నెలల మీ బిడ్డ పాలనలోనే జరిగిందని ప్ర‌జ‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు జగన్‌.

శ్రీకాకుళం జిల్లాలో 4 వేల 400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం జెట్ స్పీడ్‌తో నడుస్తోందన్నారు. ఇదే శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రలోని పూడిమడకలో మరో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వాయువేగంతో నడుస్తున్నాయన్నారు.

Tags:    
Advertisement

Similar News