మంచి చేస్తున్నా జగన్ మీద ఏడుపేనా?

దాదాపు 20 ఏళ్ళ క్రితమే మూతపడిపోయిన చిత్తూరు డెయిరీకి పూర్వవైభవం తీసుకురావాలన్నది జగన్ ఆలోచన. ఇందుకోసం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది ప్రభుత్వం. చంద్రబాబు పుణ్యమాని నాశనమైపోయిన డెయిరీని జగన్ తెరిపించటాన్ని ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది.

Advertisement
Update:2023-07-03 10:58 IST

మంచి చేస్తున్నా జగన్ మీద ఏడుపేనా?

చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు జగన్మోహన్ రెడ్డి మంగళవారం భూమి పూజ చేయబోతున్నారు. దాదాపు 20 ఏళ్ళ క్రితమే మూతపడిపోయిన చిత్తూరు డెయిరీకి పూర్వవైభవం తీసుకురావాలన్నది జగన్ ఆలోచన. ఇందుకోసం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది ప్రభుత్వం. చంద్రబాబునాయుడు పుణ్యమాని నాశనమైపోయిన డెయిరీని జగన్ తెరిపించటాన్ని ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. అందుకనే ‘చిత్తూరు డెయిరీ గోవిందా’ అనే హెడ్డింగ్‌తో పెద్ద వార్తరా సింది. వార్తలో ఏడుపు ఏమిటంటే పునరుద్ధరణకు హామీలిచ్చి డెయిరీని అమూల్‌కు అప్పగించేస్తున్నారట.

చిత్తూరు డెయిరీ గోవిందా అనే హెడ్డింగ్‌తో వార్త రాయాల్సింది ఇప్పుడు కాదు చంద్రబాబు హయాంలో మూతపడిన‌ప్పుడు. అప్పట్లో ఏమీ మాట్లాడని ఎల్లో మీడియా ఇప్పుడు పునరుద్ధరణకు ప్రయత్నాలు మొదలైనప్పుడు మాత్రం గోల చేస్తోంది. ఒకప్పుడు దేశంలోనే చిత్తూరు డెయిరీ రెండో అతిపెద్ద డెయిరీగా ఉండేది. 1995కి ముందు రోజుకు 3 లక్షల లీటర్ల చిల్లింగ్ కెపాసిటితో పాలు, పాల ఉత్పత్తులతో బ్రహ్మాండంగా వ్యాపారం చేసేది. పాలు, పాల ఉత్పత్తులు చిత్తూరు నుండి బంగ్లాదేశ్ వరకు సరఫరా అయ్యేది.

వందల మంది రైతులు, వేలాది మంది కార్మికులతో కళకళలాడుతున్న డెయిరీ మూతకు చంద్రబాబే కారణమనే ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. సొంతంగా హెరిటేజ్ డెయిరీని ఏర్పాటుచేసుకున్న చంద్రబాబు చిత్తూరు డెయిరీని దెబ్బకొట్టారని ఇప్పటికీ చాలామంది చెబుతూనే ఉంటారు. 20 ఏళ్ళ క్రితమే చిత్తూరు డెయిరీ పూర్తిగా మూతపడిపోయింది.

మూతపడే నాటికి వందల కోట్ల బకాయిలున్నాయి. ఆ బకాయిలు తీర్చమని ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు జగన్ రూ.182 కోట్ల బకాయిలను తీర్చారు. పునరుద్ధరణ పనులను పది నెలల్లో పూర్తిచేసి డెయిరీని మళ్ళీ నడిపించేట్లుగా రెడీ చేయాలని ఆదేశించారు. పునరుద్ధరణ పనులను అమూల్‌కు అప్పగించారు. అమూల్ సుమారు రూ. 400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. మొదటగా దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ప్లాంట్‌ను రూ.150 కోట్లతో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 25 లక్షల మంది పాడి రైతులతో అమూల్ ఒప్పందాలు చేసుకుంది. పునరుద్ధరణకు జగన్ ఇంత అవస్థలు పడుతుంటే చిత్తూరు డెయిరీ గోవిందా అని ఎల్లో మీడియా ఏడుపు వార్తలు రాయటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News