కాబోయే సీఎం షర్మిల..?
అతి చేస్తున్న టీవీ ఛానళ్లకు, దినపత్రికలకూ ఈ విషయం తెలియక కాదు. జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక గడ్డిపరక దొరికినా గోదావరి ఈదే ప్రయత్నం వాళ్లది. అందుకే షర్మిలని హైలైట్ చెయ్యడం.
ఆరేంజ్‌లో ఉంది, కొన్ని టీవీ ఛానళ్లు, కొన్ని దినపత్రికల తీరు. కడప చేరుకున్న షర్మిల, కాసేపట్లో ఇడుపులపాయకు షర్మిల, త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా షర్మిల.. ఈ రకంగా ఉంది వాళ్ల ఓవర్ యాక్షన్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ప్రమాణం రేపే, ఈరోజే అంటూ ఆర్భాటం చేస్తున్నారు. అక్కడ అసలు కాంగ్రెస్ పార్టయే లేనప్పుడు, ఈమె వీరంగం వల్ల వొరిగేదేమిటి..? అతి చేస్తున్న టీవీ ఛానళ్లకు, దినపత్రికలకూ ఈ విషయం తెలియక కాదు. జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక గడ్డిపరక దొరికినా గోదావరి ఈదే ప్రయత్నం వాళ్లది. అందుకే షర్మిలని హైలైట్ చెయ్యడం.
వైఎస్ రాజశేఖరరెడ్డి లాగా, ఒక జగన్మోహన్‌రెడ్డిలాగా ఆమె ఎప్పటికీ జనాన్ని ఉత్తేజపరచలేదు. ‘నేను వైఎస్ కూతుర్ని’ అని చెప్పుకున్నంత మాత్రాన జనమూ, ఓట్లు వందలుగా వచ్చి పడిపోవు. అయినా జగన్ అయిపోయినట్టే, జగన్ కొంప మునిగిపోయినట్టే అని ప్రతిరోజూ, పొద్దున్నా, సాయంకాలం చెప్పడం వాళ్లకో శునకానందం. చూశారా, సొంత చెల్లాయే అన్న మీద తిరగబడుతోంది అని ప్రచారం చెయ్యడం ఒక లేకితనం.
పాపం షర్మిల! తన ప్రయత్నం ఏదో తాను చేసుకుంటోంది. అయినా, ఆంధ్రలో కాంగ్రెస్ కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లన్నా గెలవగలదా..? అక్కడ ఎన్నికలంటే ఎన్ని కోట్ల ఖరీదైన పొలిటికల్ గేమో అంచనా వెయ్యగలరా..? ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలతో అలరారుతున్న జగన్మోహన్‌రెడ్డిని ఈ పిల్లకాకి ఎదుర్కోగలదా..? జనాన్ని ఫూల్స్‌ని చేయడానికి మీడియా తనని తాను మోసం చేసుకుంటోంది.
అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత ఉందా జగన్‌కి అని ఈనాడు రాసిపారేసింది. ఒక గొప్ప పనిచేసినా, పనిగట్టుకొని నిందించడం, విమర్శలు గుప్పించడం చేతగాని వాళ్లు చేసేపని..! మళ్లీ జగన్ గెలిచిపోతాడేమోనన్న భయం ‘కుట్ర మీడియా’కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..! పాపం షర్మిల !!