ఏర్పాట్లు చేస్తున్నా ఎల్లో మీడియాకు ఏడుపేనా?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లో మీడియా ఏడుపు రోజురోజుకు పెరిగిపోతోంది. పనిచేస్తే ఒక ఏడుపు చేయకపోతే మరో ఏడుపు అన్నట్లుగా తయారైంది.

Advertisement
Update:2022-11-10 11:58 IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లో మీడియా ఏడుపు రోజురోజుకు పెరిగిపోతోంది. పనిచేస్తే ఒక ఏడుపు చేయకపోతే మరో ఏడుపు అన్నట్లుగా తయారైంది. ఈనెల 11, 12 తేదీల్లో ప్ర‌ధాని నరేంద్ర మోడీ విశాఖలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 12వ తేదీన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి పాల్గొనే బహిరంగ స‌భ‌ అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రిస్టేజిగా తీసుకుంటుంది కదా. అందుకనే సభ సక్సెస్ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీన్నే ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది.

'ప్రధానిని ప్రసన్నం చేసుకునేలా జనసమీకరణ' అని పెద్ద అక్షరాలతో ఒక కథనం అచ్చేసి తన ఏడుపును బయటపెట్టుకుంది. ప్రధాన మంత్రి ముఖ్యఅతిథిగా జరగబోయే బహిరంగసభను విజయవంతం చేయాలనే ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయటంలో తప్పేముంది ? మోడీ పర్యటన ఏర్పాట్లను ప్రత్యేకంగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారని గోల చేస్తోంది. ఏర్పాట్లను ఎవరు పర్యవేక్షిస్తే ఏమిటి సమస్య ? సాయిరెడ్డేమీ ప్రైవేటు వ్యక్తి కాదు కదా అధికార పార్టీలో కీలకమైన నేత, రాజ్యసభ ఎంపీ.

సాయిరెడ్డి చేసే ప్రతి ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే ఉంటుందనటంలో సందేహం లేదు. ప్రధాని కార్యక్రమాన్ని వైసీపీ హైజాక్ చేసిందని ఏడుపొకటి. ఇందులో ప్రధాని కార్యక్రమాన్ని వైసీపీ హైజాక్ చేయటం ఏముంది? ప్రధాని పర్యటన ఏర్పాటు చేసింది వైసీపీ కాదన్న ఇంగితం కూడా ఎల్లో మీడియాలో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ప్రధాని కార్యక్రమం ఫిక్సయిందని తెలీదా? ప్రధాని రాక సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లలో బీజేపీని దూరంగా పెట్టేశారంటు భోరున ఏడ్చింది. ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చేస్తుంటే మధ్యలో బీజేపీ పాత్రేమిటసలు?

మోడీ వస్తున్నది అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకే కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాదని ఎల్లో మీడియాకు తెలీదా? బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు నిజయోజకవర్గాల వారీగా జనసమీకరణకు టార్గెట్లు పెట్టారట. ముఖ్యమంత్రిగా ఎవరున్నా బహిరంగసభ విజయవంతం అయ్యేందుకు చేసేదిదే కదా? కాకపోతే ప్రధాని పాల్గొనే బహిరంగసభ కాబట్టి ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారంతే. ఇంతోటిదానికి ప్రధానిని ప్రసన్నం చేసుకునేది ఏముంది? రెండు రోజుల కార్యక్రమాల్లో చంద్రబాబునాయుడు అండ్ కో పాల్గొనే అవకాశం లేదనేదే అసలు ఏడుపులాగుంది.

Tags:    
Advertisement

Similar News