వైసీపీ షాక్‌.. మాజీ మంత్రి అవంతి రాజీనామా

పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్న మాజీ మంత్రి

Advertisement
Update:2024-12-12 11:16 IST

వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పార్టీ పలువురు రాజీనామా చేయగా.. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జగన్‌, ఉత్తరాంధ్ర కోర్డినేటర్‌ విజయసాయిరెడ్డికి రాజీనామా లేఖ పంపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ఐదేళ్లు వైసీపీ కార్యకర్తలు నలిగిపోయారని తెలిపారు. తాడేపల్లిలో కూర్చుని జగన్‌ ఆదేశాలిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఐదేళ్లు తీర్పునిచ్చారు. కనీసం ఐదు నెలల కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని శ్రీనివాస్‌ ప్రశ్నించారు. 

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నారు. దీనిపై స్పందించిన జగన్‌ పోతే పోని మళ్లా ఇంకొకరు వస్తారని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News