ఎవరినీ వదిలిపెట్టం.. రిటైరైనా బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి నేతలకు కొందరూ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2025-02-18 14:44 IST

ఏపీలో కూటమి నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా విజయవాడలోని జిల్లా జైలులో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వంశీని తప్పుడు కేసులో ఇరికించారని తెలిపారు. పోలీసులు టీడీపీ నేతలకు కాకుండా టోపీ పై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టండి. తెలుగు దేశం నేతలకు సెల్యూట్ కొట్టి, వారు చెప్పినట్టు చేసి అన్యాయం చేస్తే.. మాత్రం బాగోదు. రేపు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తాం. వంశీని అరెస్ట్ చేసి సీఐ అన్నాడట.. రిటైర్డ్ అయ్యాక సప్త సముద్రంలో ఉన్నా కూడా అన్యాయం చేసిన అధికారులందరి బట్టలు ఊడదీసి నిలబెడతామని జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. తన సామాజిక వర్గానికి నుంచి ఒకడు ఎదుగుతున్న చంద్రబాబు తట్టుకోలేడని తనకన్నా, లోకేష్‌ కన్నా గ్లామర్‌ ఉంటే చంద్రబాబు సహించలేరు.

తమ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే.. వాళ్లిద్దరూ తట్టుకోలేరు. అందుకే వంశీ అంటే చంద్రబాబుకి అంత మంట. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే.. వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బంది పెడతారు. అదీ చంద్రబాబు మనస్తతత్వం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి ఘటనకు వల్లభనేని వంశీకి ఇటువంటి సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారని ఆరోపించారు. అందుకే కేసును రీఓపెన్ చేశారని అన్నారు. ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా చేర్చాలని అన్నారు. కూటమి నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్​ వెంట వంశీ భార్య పంకజశ్రీ, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఉన్నారు. జగన్​ రాకతో జైలు ప్రాంగణం వద్ద కోలాహలంగా మారింది.

Tags:    
Advertisement

Similar News