ఇది ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి..

నీ మీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్లకూ ఈ రోజుతో భ్రమలు తొలగించేశావు. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ఠ్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధం అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

Advertisement
Update:2023-09-14 16:27 IST

ఏపీలో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని, బీజేపీ త‌మ‌తో కలిసి వస్తుందని ఆశిస్తున్నామంటూ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ స్పందించింది. సింగిల్‌ లైన్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని గతంలోనూ పవన్ కల్యాణ్ అన్నారు.. కానీ, పొత్తుల అంశం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని ఏపీ బీజేపీ తరఫున ప్రకటన విడుదలైంది.


అటు ఈ పొత్తు వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. ''ప్యాకేజీ బంధం బయటపడింది. నువ్వు రాజమండ్రి జైలుకు వెళ్లింది పొత్తును ఖాయం చేసుకునేందుకేనని ప్రజలకు పూర్తిగా అర్థమైంది పవన్. ఇన్నాళ్లూ నీ మీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్లకూ ఈ రోజుతో భ్రమలు తొలగించేశావు. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ఠ్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధం'' అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.


ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పొత్తు ఇప్పుడే కుదిరింది అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. ఊళ్లోపెళ్లికి కుక్కల హడావుడిలా పవన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ''ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే .. నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరు కల్యాణ్ బాబు. ఎప్పుడో అయ్యాడు ఇప్పుడేముంది కొత్తగా ములాఖత్. జనసైనికులు ఆలోచించండి.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా లేదూ?'' అంటూ అంబటి రాంబాబు విమర్శించారు.

*

Tags:    
Advertisement

Similar News