విజయసాయిరెడ్డి కొత్త టీవీ చానల్ ప్రకటన

విశాఖలో 70-80 శాతం భూములు చంద్రబాబు సామాజికవర్గం చేతుల్లో ఉన్నాయని.. విశాఖ, ఉత్తరాంధ్రలో కాపులు, యాదవులు, వెలమలు ఎక్కువగా ఉన్నా భూములు, ఆస్తులు మాత్రం చంద్రబాబు వర్గం చేతిలోనే ఉన్నాయన్నారు.

Advertisement
Update:2022-10-11 13:39 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త టీవీ చానల్ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. రామోజీరావు పత్రిక, టీవీ ఉందని ఇష్టానుసారం రాస్తున్నారని.. త్వరలో తానే స్వయంగా టీవీ చానల్ పెట్టబోతున్నానని ఇకపై చూసుకుందామని రామోజీరావుకు విజయసాయిరెడ్డి సవాల్ చేశారు. రామోజీరావుపై ఒక సీరియల్ రాస్తానని కూడా చెప్పారు.

విశాఖ దసపల్లా భూములపై మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి.. భూములు కమలాదేవికి చెందుతాయ‌ని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. ఈ విషయం తెలిసి కూడా కుల పిచ్చితో రామోజీ రాస్తున్నాడని మండిపడ్డారు. 64 మంది స్థలాల యజమానుల్లో 55 మంది చంద్రబాబు సామాజికవర్గం వారేనని.. ప్రస్తుత నిర్ణయంతో ఎక్కువ లబ్ది పొందేది చంద్రబాబు సామాజికవర్గమేనన్నారు.

విశాఖలో 70-80 శాతం భూములు చంద్రబాబు సామాజికవర్గం చేతుల్లో ఉన్నాయని.. విశాఖ, ఉత్తరాంధ్రలో కాపులు, యాదవులు, వెలమలు ఎక్కువగా ఉన్నా భూములు, ఆస్తులు మాత్రం చంద్రబాబు వర్గం చేతిలోనే ఉన్నాయన్నారు. కుల పత్రికలపై ప్రజలు ఉమ్మేసే పరిస్థితి వచ్చిందన్నారు. తన కుమార్తె కుటుంబం 40ఏళ్లుగా వ్యాపారాల్లో ఉందని వారి వ్యాపారాలతో తనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బ్రహ్మణి సంపాదిస్తే బాలకృష్ణ ఆస్తి అయిపోతుందా?.శైలజ ఆస్తులు కొనుగోలు చేస్తే సుందరరావుకు దక్కుతాయా? అని ప్రశ్నించారు. పక్క వాళ్లది వ్యభిచారం తనది సంసారం అన్నట్టుగా రామోజీ తీరు ఉందని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. దసపల్లా భూములపై ఏ విచారణకైనా తాను సిద్ధమని రామోజీకి సవాల్ చేశారు.

Tags:    
Advertisement

Similar News