గోరంట్ల మాధవ్ ఇంటి అద్దె ఎగ్గొట్టారా..?

ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి అద్దె చెల్లించాలని కోరినా ఎంపీ నుంచి స్పందన లేదు. దాంతో మల్లికార్జున రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఎంపీ అద్దెకుంటున్న ఇంటి ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు.

Advertisement
Update:2022-11-08 08:32 IST

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంటికి అద్దె చెల్లించకుండా యజమానిని వేధిస్తున్నారని వార్తలొస్తున్నాయి. దీనిపై జ‌రిగిన పంచాయితీ కూడా విఫలమైనట్టు చెబుతున్నారు. హిందూపురం ఎంపీ అయినప్పటికీ మాధవ్‌ అనంతపురం టౌన్ రామ్‌నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. చాలా కాలంగా ఆయన ఇంటికి అద్దె చెల్లించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి అద్దె చెల్లించాలని కోరినా ఎంపీ నుంచి స్పందన లేదు. దాంతో మల్లికార్జున రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఎంపీ అద్దెకుంటున్న ఇంటి ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. తొలుత మధ్యవర్తులతో చర్చలు నిర్వహించారు. అక్కడా ఫలితం లేకపోవడంతో సీఐ హుస్సేన్.. మాధవ్ ఇంటికి మల్లికార్జున రెడ్డిని తీసుకెళ్లారు.

అక్కడే సీఐ మధ్వవర్తిత్వంలో మాధవ్, మల్లికార్జున రెడ్డి మధ్య చర్చలు జరిగాయి. అక్కడ కూడా చర్చలు ఫలించలేదని చెబుతున్నారు. వ్యవహారాన్ని వివాదం చేయకుండా మరోసారి కూర్చుని మాట్లాడుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. ఎంపీకి, మల్లికార్జునరెడ్డి మధ్య పోలీసుల సమక్షంలో జరిగిన పంచాయితీకి సంబంధించిన ఫొటోలను బయటకు వచ్చాయి.

Advertisement

Similar News