ఆర్థిక రాజధానిగా విశాఖ

కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు

Advertisement
Update:2024-10-19 13:13 IST

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. తూళ్లూరు మండలం ఉద్దండపాలెం వద్ద ఈ పనులు మొదలుపెట్టారు. సీఆర్‌డీఏ ఆఫీసు పనులు ప్రారంభించి భవన ప్రాంగణంలో సీఎం, మంత్రి నారాయాణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్రను తిరగరాయడానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యామని చెప్పారు. ముందుచూపుతో నాడే సైబరాబాద్‌లో ఎనిమిది లైన్ల రోడ్డు వేశామన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ఎందుకని అందరూ ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడేవారు ప్రతి చోటా ఉంటారు. అమరావతి రైతులను ఒప్పించి భూమి సేకరించామన్నారు. రాజధాని, సమాజ హితం కోసం మీరంతా భూములు ఇచ్చారు. అమరావతి కోసం 54 వేల ఎకరాలు సేకరించామన్నారు. మహిళా రైతులు వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడారని సీఎం అన్నారు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం. ఒక రాష్ట్రం, ఒక రాజధాని అని ప్రతిచోటా చెప్పానని గుర్తు చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News