విశాఖ శారదాపీఠంకు షాకిచ్చిన కూటమి సర్కార్
విశాఖ శారాదా పీఠంకు ఏపీలో కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ శారాదా పీఠంకు ఏపీలో కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైజాగ్‌లో 15 ఎకరాల స్థలం విలువ రూ. 220 కోట్లు అయితే.. కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత జగన్ ప్రభుత్వం ఇచ్చింది. దాంతోపాటే, తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని వైఎస్ జగన్‌కు ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖ జిల్లాలోని భీమిలి సమీపంలో వేద విద్యాలయం ఏర్పాటు చెయ్యడానికి భూమి కేటాయించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మనవి చేసింది. గురువు అడిగిన వెంటనే మాజీ సీఎం జగన్ శారదా పీఠానికి భూమి ఇవ్వడానికి అంగీకరించారు.