పవన్‌ని ముందు ఆస్పత్రిలో చూపించాలి

ఊసరవెల్లిలా పవన్‌ ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నాడని చెప్పారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదన్నారు. గతంలో పవన్‌ను తిట్టిన వ్యక్తికే ఇప్పుడు టికెట్‌ ఇచ్చారని గుర్తుచేశారు.

Advertisement
Update:2024-04-22 15:56 IST

పవన్‌ కల్యాణ్‌కి పిచ్చి బాగా ముదిరినట్టు కనిపిస్తోందని, చిరంజీవి ఆయన్ని ముందుగా ఏదైనా ఆస్పత్రిలో చూపించాలని ప్రభుత్వ విప్, వైసీపీ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సూచించారు. పవన్‌ వాడుతున్న భాష, రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణాలని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి భీమవరంలో నిర్వహించిన సభలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు సోమవారం భీమవరంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో గ్రంధి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ ఆకు రౌడీలా మాట్లాడుతున్నాడని, ఆయనకు పిచ్చి బాగా ముదిరిపోయిందన్నారు. ఆయన మానసిక స్థితి బాగోలేదన్నారు.

పవన్‌కి రాజకీయ విలువలు లేవు..

పవన్‌కి అసలు రాజకీయ విలువలే లేవని గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు. ఊసరవెల్లిలా పవన్‌ ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నాడని చెప్పారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదన్నారు. గతంలో పవన్‌ను తిట్టిన వ్యక్తికే ఇప్పుడు టికెట్‌ ఇచ్చారని గుర్తుచేశారు. తల్లిని తిట్టిన వ్యక్తులతో అంటకాగుతున్న వ్యక్తి పవన్‌ అని చెప్పారు. ఆయన గురించి స్పందించడం కూడా దండ‌గ అని గ్రంధి శ్రీనివాస్‌ చెప్పారు.

చిరంజీవి పక్కా కమర్షియల్‌...

చిరంజీవి కూడా తనను నమ్మినవారిని ముంచేసి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేశారని గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు. కేంద్ర మంత్రి పదవి కోసమే ఆయన ఇదంతా చేశారని అన్నారు. చిరంజీవి పక్కా కమర్షియల్‌.. అంటూ ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు. ఇప్పుడు తన సినిమా ప్రమోషన్‌ కోసం పవన్‌కు మద్దతిస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీని హోల్‌సేల్‌గా టీడీపీకి అమ్మితే ఒక్కసారే డబ్బులొస్తాయని, ప్రతి ఎలక్షన్స్‌కి ఒకసారి అమ్మితే ప్రతిసారీ వస్తాయని ఆయన విమర్శించారు. పవన్‌ ఇప్పుడు చేస్తున్న వ్యాపారం ఇదేనని ఆయన చెప్పారు.

భీమవరంలో కంపోస్ట్‌ యార్డు ఏర్పాటు చేయడానికి ఆరు ఎకరాల భూమి సేకరించినట్టు గ్రంధి శ్రీనివాస్‌ చెప్పారు. దీనికి సంబంధించి రైతులకు డబ్బు కూడా చెల్లించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే అనేకసార్లు ప్రజలకు వివరించామన్నారు. పవన్‌ ఇప్పుడొచ్చి అజ్ఞానం, పిచ్చితో ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News