దాడిపై వైసీపీ నేతల రియాక్షన్

`వాడికి 100 మందితో టీం ఉంటే.. మాకు పది వేల మంది ఉన్నారని.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే పవన్‌ కల్యాణ్‌ను చీరేస్తామని` ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
Update:2022-10-15 21:01 IST

విశాఖలో మంత్రులపై జనసేన దాడిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు పంపిస్తే పవన్‌ కల్యాణ్ ఈ రోజు విశాఖ పర్యటనకు వచ్చారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌పై దాడి చేయడం తమకు ఏమంత కష్టమైన పని కాదన్నారు. `వాడికి 100 మందితో టీం ఉంటే.. మాకు పది వేల మంది ఉన్నారని.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే పవన్‌ కల్యాణ్‌ను చీరేస్తామని` దువ్వాడ వార్నింగ్ ఇచ్చారు. దాడి చేసిన వ్యక్తులను ఎక్కడి నుంచి రప్పించారన్న దానిపై నిజానిజాలు తేల్చాలని దువ్వాడ డిమాండ్ చేశారు.

వీరిని జనసైనికులు అనడం కంటే జనసైకోలు అంటే బాగుంటుందని మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. విశాఖ పర్యటనకు పవన్‌ వస్తున్నారని ప్రకటించిన రోజే అతడి ఉద్దేశాలపై తాము అనుమానాలు వ్యక్తం చేశామన్నారు. ఈ దాడికి పూర్తి బాధ్యత పవన్‌ కల్యాణే వహించాలన్నారు.

ఉదయం జరిగిన గర్జన ర్యాలీ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి కావాలనే మంత్రులపై దాడి చేయించారని మంత్రి అమర్‌నాథ్ ఆరోపించారు. దాడి చేసిన వారి దృశ్యాలన్నీ రికార్డు అయి ఉన్నాయని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అప్పటికప్పుడు జరిగిన దాడి కానేకాదని..పవన్‌ కల్యాణ్‌ ప్రతిదీ ముందస్తు స్క్రిప్ట్‌ ప్రకారమే చేస్తారన్నారని అమర్నాథ్ ఆరోపించారు.

జనసేన కార్యకర్తలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మంత్రి తానేటి వనిత ఆరోపించారు. ప్రజల నుంచి మద్దతు లేక మీడియా ముందు హల్‌చల్ చేయాలని చూస్తున్నారని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి.

ఇదో ఉన్మాదుల చర్యగా స్పీకర్ తమ్మినేని అభివర్ణించారు. తాడుబొంగరం లేని వారు అక్కడికి వెళ్లి కేకలు వేసి అల్లరి చేయడం తప్ప ఉపయోగం ఏముందని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News