గుంటనక్కలు, తోడేళ్లు ఒక్కటయ్యాయి.. మెగాస్టార్‌పై సజ్జల ఫైర్
ఏపీ పొలిటికల్ తెరపై ఓ క్లారిటీ వచ్చిందన్నారు సజ్జల. గుంటనక్కలు, తోడేళ్లు ఒక్కటయ్యాయని సెటైర్ వేశారు. రాష్ట్రంలో జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడని, జగన్‌వైపే ఏపీ ప్రజలు కూడా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు సజ్జల.
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి. బాబు బాటలో నడుస్తున్న పవన్‌కల్యాణ్ సైతం ఈ ఎన్నికల తర్వాత రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమన్నారు. పవన్ ఎందుకు రాజకీయాల్లోకి అడుగు పెట్టారో ఆయనకే తెలియదని విమర్శించారు. పార్టీ నాయకుడిగా పవన్ ఆలోచనల్లో ఏనాడూ స్పష్టత లేదన్నారు సజ్జల.
ఏపీ పొలిటికల్ తెరపై ఓ క్లారిటీ వచ్చిందన్నారు సజ్జల. గుంటనక్కలు, తోడేళ్లు ఒక్కటయ్యాయని సెటైర్ వేశారు. రాష్ట్రంలో జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడని, జగన్‌వైపే ఏపీ ప్రజలు కూడా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు సజ్జల. మెగాస్టార్ చిరంజీవిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల. చిరంజీవి కూటమికి మద్దతు ఇవ్వడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గెలుపును అడ్డుకోలేరన్నారు.
పవన్ ఎంత ఒత్తిడి చేసి చిరంజీవితో అలా చెప్పించారో అని ఆరోపించారు సజ్జల. ఫ్యాన్స్‌ను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు చిరంజీవి ఏపీలోనే నివాసం ఉండరని అన్నారు సజ్జల. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చిరంజీవిని పవన్‌కల్యాణ్ వాడుకుంటున్నారంటూ విమర్శించారు సజ్జల.