షర్మిలను మూడునెలలు భరించాల్సిందేనా..?

జగన్మోహన్ రెడ్డిపైన ఆరోపణలు, విమర్శలు చేస్తే ఎల్లోమీడియా బాగా పబ్లిసిటీ ఇస్తుందని షర్మిలకు బాగా తెలుసు. అందుకనే రాజకీయంగానే కాకుండా ప్రభుత్వంపైన చివరకు ఇంటి విషయాలను కూడా రచ్చకీడుస్తున్నారు.

Advertisement
Update:2024-01-30 11:47 IST

షర్మిలను మూడునెలలు భరించటం ఏమిటనే సందేహం రావచ్చు. ఎందుకంటే.. మ‌రో మూడునెలల్లో ఏపీలో ఎన్నికలు పూర్త‌వుతాయి కాబట్టే. ఎన్నికలు అయిపోయిన తర్వాత షర్మిల ఎవరికీ కనబడే అవకాశాలు లేవు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ హోదాలో నానా రచ్చచేస్తోంది. జగన్మోహన్ రెడ్డిపైన ఆరోపణలు, విమర్శలు చేస్తే ఎల్లోమీడియా బాగా పబ్లిసిటీ ఇస్తుందని షర్మిలకు బాగా తెలుసు. అందుకనే రాజకీయంగానే కాకుండా ప్రభుత్వంపైన చివరకు ఇంటి విషయాలను కూడా రచ్చకీడుస్తున్నారు.

ఇదే పద్దతిలో ఎన్నికల వరకు షర్మిల నానా హడావుడి చేయటం, ఎల్లోమీడియా దాన్ని బాగా హైలైట్ చేయటం తప్పదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాట్ నెక్ట్స్..? ఏమీలేదు తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని చివరకు ఏమిచేశారు..? ఏపీలో కూడా అంతేచేస్తారు. తెలంగాణలో పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. కానీ, ఏపీలో పార్టీ చీఫ్ గా ఇక ఆమె చేయటానికి ఏమీ ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ గెలుచుకునే సీట్లు ఏమీ ఉండవు కాబట్టే. ఎన్నికలకు ముందంటే నానా రచ్చచేస్తున్నారు కానీ ఎన్నికలైపోయిన తర్వాత ఆమె చేసే రచ్చేముంటంది..?

ఎల్లోమీడియా కూడా షర్మిలను పట్టించుకోదు. ఇప్పుడంటే జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి బాగా హైలైట్ చేస్తోంది. రేపు జగన్ అధికారంలోకి వచ్చినా లేదా చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఎల్లోమీడియాకు షర్మిలతో పనుండదు. ప్రచారంలో కనబడనప్పుడు ఇక షర్మిలను పట్టించుకునే వాళ్ళెవరు..? జాతీయస్ధాయి పరిణామాలను చూసినా వచ్చేఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు పెద్ద సీనుండని అర్థ‌మైపోతోంది. జాతీయస్థాయిలో లేక ఏపీలోనూ కాంగ్రెస్ చతికలపడిన తర్వాత షర్మిలకు మాత్రం పనేముంటుంది..?

అప్పుడు పార్టీ షర్మిలను పట్టించుకోదు, అలాగే షర్మిల కూడా పార్టీలో యాక్టివ్ గా ఉండరు. ఆమె ఇప్పుడు చేస్తున్న ఓవరాయక్షనంతా ఎవరికోసం, ఎవరుచెబితే, ఎందుకోసం చేస్తున్నారో జనాలకు అర్థ‌మవుతున్నది. కాబట్టి మూడునెలల్లో ఎన్నికలు అయిపోతే ఆ తర్వాత షర్మిల ఏపీలో ఉండేది లేదు, చేసేందుకు పనీ ఉండదు. అందుకనే షర్మిలను జనాలు మూడునెలలు భరించక తప్పదు.

Tags:    
Advertisement

Similar News