ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కు ఈసీ షాక్ తప్పదా..?

జనసేన పార్టీ సింబల్‌ గాజు గ్లాసును ఉద్దేశించి చెప్పినట్లుగా ఓ డైలాగ్ కూడా ఉంటుంది. టీజర్‌ విడుదలైన వెంటనే దీనిమీద చర్చ ప్రారంభమైంది. ఉద్దేశపూర్వకంగానే ఈ డైలాగ్స్‌ను ఈ సినిమాలో చొప్పించారని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement
Update:2024-03-20 17:14 IST

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్‌ సింగ్‌ సినిమా టీజర్‌ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్ తన సినిమాలను రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత్‌ సింగ్‌లోనూ అదే కనిపించింది.

అయితే ఈ టీజర్‌లో విలన్ టీ గ్లాస్‌ను కింద పడేసి నీ రేంజ్‌ ఇది అంటూ హీరో పవన్‌ను ఉద్దేశించి కామెంట్ చేస్తాడు. దానికి బదులుగా సమాధానం ఇస్తూ గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కుద్ది అంటూ డైలాగ్‌ చెప్తాడు పవన్‌కల్యాణ్‌. ఇక టీజర్‌ చివర్లోనూ కచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్‌ అంటే సైజు కాదు సైన్యం అంటూ తన జనసేన పార్టీ సింబల్‌ గాజు గ్లాసును ఉద్దేశించి చెప్పినట్లుగా ఓ డైలాగ్ కూడా ఉంటుంది. టీజర్‌ విడుదలైన వెంటనే దీనిమీద చర్చ ప్రారంభమైంది. ఉద్దేశపూర్వకంగానే ఈ డైలాగ్స్‌ను ఈ సినిమాలో చొప్పించారని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.

ఉస్తాద్‌ భగత్ సింగ్ టీజర్ అంశం ఈసీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్‌ మీనా తాజాగా స్పందించారు. ఉస్తాద్ భగత్‌ సింగ్‌ టీజర్ ఇప్పటివరకూ తాను చూడలేదన్నారు. టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఎలక్షన్ కమిషన్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News