పవన్ గడప కూడా దాటలేదు

పొత్తుకు సాధ్యంకాని షరతులను అమిత్ షా టీడీపీ అధినేత ముందుంచారనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది. పొత్తులో బీజేపీ, జనసేనకు 75 అసెంబ్లీ సీట్లివ్వాలని, 12 పార్లమెంటు సీట్లివ్వాలని అమిత్ చెప్పారట.

Advertisement
Update:2024-02-15 10:59 IST

పవన్ గడప కూడా దాటలేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గడప కూడా దాటలేదు. పవన్ వైఖరితో టీడీపీ-బీజేపీ పొత్తుపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. బీజేపీతో పొత్తు విషయమై ఢిల్లీకి వెళ్ళి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబునాయుడు భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. భేటీలో చర్చలపై అటు అమిత్, ఇటు చంద్రబాబు ఇద్దరూ నోరిప్పలేదు. దాంతో చర్చల్లో ఏమి నిర్ణయమైందనే విషయమై క్లారిటీ లేకపోవటంతో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

అయితే జరుగుతున్న చర్చలను పక్కనపెట్టేస్తే అమిత్ షా, చంద్రబాబు భేటీ తర్వాత పవన్ ఢిల్లీకి వెళతారని, పొత్తును ఫైనల్ చేసుకువస్తారనే ప్రచారం బాగా జరిగింది. ఢిల్లీ నుండి చంద్రబాబు తిరిగొచ్చి వారంరోజులవుతున్నా ఇంతవరకు పవన్ ఢిల్లీకి వెళ్ళలేదు. అదిగో వెళుతున్నారు.. ఇదిగో వెళుతున్నారంటూ రెండురోజులు మీడియా ఊదరగొట్టింది. తర్వాత ఎందుకనో మీడియా కూడా దానిపై ఇప్పుడు మాట్లాడటంలేదు. అమిత్ షా అపాయిట్మెంట్ పవన్ కు ఫిక్స్ కాలేదో లేకపోతే చంద్రబాబు, పవనే బీజేపీతో పొత్తుపై చర్చలు ఎందుకులే అనుకున్నారో అర్థంకావటంలేదు.

దీనికి కారణం ఏమిటంటే.. పొత్తుకు సాధ్యంకాని షరతులను అమిత్ షా టీడీపీ అధినేత ముందుంచారనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది. పొత్తులో బీజేపీ, జనసేనకు 75 అసెంబ్లీ సీట్లివ్వాలని, 12 పార్లమెంటు సీట్లివ్వాలని అమిత్ చెప్పారట. అలాగే కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ముందు పవన్ ప్రమాణస్వీకారం చేస్తారని స్పష్టంగా చెప్పారట. ఇలాంటి అనేక షరతులను పెట్టిన కారణంగానే బీజేపీతో పొత్తుపై చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు పార్టీవర్గాల సమాచారం.

ఇప్పుడు విషయం ఏమిటంటే.. బీజేపీతో పొత్తుపెట్టుకుంటే ఒక సమస్య, పెట్టుకోకపోతే మరో సమస్య అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. అమిత్ షా పెట్టిన కండీషన్లు ఏ కోణంలో చూసినా ఆచరణ సాధ్యంకాదని చంద్రబాబు అనుకుంటున్నారట. కండీషన్లపై ఎలా స్పందించాలో కూడా అర్థంకాకనే చంద్రబాబు వారంనుండి మీడియాకు మొహంచాటేస్తున్నారట. జిల్లాల పర్యటనలను రద్దుచేసుకుని, మీడియాకు కూడా మొహం చాటేశారంటేనే అర్థ‌మైపోతోంది అమిత్ షా కండీషన్లకు చంద్రబాబు ఎంతగా టెన్షన్ పడిపోతున్నారో. చంద్రబాబు మైండ్ బ్లాంక్ అవ్వబట్టే పవన్ కూడా ఏమీ మాట్లాడలేక ఢిల్లీకి వెళ్ళటంలేదట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News