పవన్ నోరు పడిపోయిందా?

ముడుపుల భాగోతంలో నిజాలు ఏమిటో చెప్పాలని చంద్రబాబును పవన్ ఎందుకు డిమాండ్ చేయటంలేదు? ప్రశ్నించటం కోసమే పార్టీని పెట్టానని కదా పవన్ చెప్పుకుంటున్నది. మరి చంద్రబాబుకు ఐటీ షాకాజ్ నోటీసు జారీ చేయటం ప్రశ్నించేంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదని పవన్ అనుకుంటున్నారా?

Advertisement
Update:2023-09-02 12:23 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు పడిపోయింది. అవకాశం దొరికినా దొరక్కపోయినా దొరికించుకుని మరీ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడంటూ నానా గోల చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. భూ దోపిడీ, ఇసుక దోపడిలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, గంజాయి అక్రమ వ్యాపారంలో కూడా జగన్ వేల కోట్ల రూపాయలు వేనకేసుకుంటున్నాడంటు ఆరోపణ చేయని రోజుండదు. నీతికి తానే ప్రతిరూపమన్నట్లు పవన్ మాట్లాడుతుంటారు.

అలాంటిది చంద్రబాబునాయుడు అవినీతి గురించి మాట్లాడేందుకు ఎందుకు నోరు లేవటంలేదో అర్థంకావటంలేదు. అమరావతి నిర్మాణం పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నది అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తాత్కాలిక నాసిరకం నిర్మాణాలను చేసిన షాపూర్ జీ పల్లోంజి కంపెనీ నుండి చంద్రబాబుకు రూ.118 కోట్లు ముడుపులు ముట్టినట్లు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది. 2022, సెప్టెంబర్ 22వ తేదీనే ఐటీ ఉన్నతాధికారులు సమాధానం చెప్పమని చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు.

ఆ నోటీసులకు చంద్రబాబు ఏమి సమాధానం చెప్పారో తెలీదు. అయితే ఆ సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఐటీ ఉన్నతాధికారులు ఆగస్టు 4వ తేదీన మరో షోకాజ్ నోటీసు జారీచేశారు. ఆ షోకాజ్ నోటీసే ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో ఎవరి దగ్గర నుండి, ఎవరి ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే విషయం కూడా ఉంది. మరిప్పుడు బయటపడిన చంద్రబాబు ముడుపుల వ్యవహారం మీద పవన్ ఎందుకు మాట్లాడటంలేదు?

ముడుపుల భాగోతంలో నిజాలు ఏమిటో చెప్పాలని చంద్రబాబును పవన్ ఎందుకు డిమాండ్ చేయటంలేదు? ప్రశ్నించటం కోసమే పార్టీని పెట్టానని కదా పవన్ చెప్పుకుంటున్నది. మరి చంద్రబాబుకు ఐటీ షాకాజ్ నోటీసు జారీ చేయటం ప్రశ్నించేంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదని పవన్ అనుకుంటున్నారా? ఆధారాలు లేకపోయినా జగన్ పైన ప్రతిరోజు ఆరోపణలతో బురదచల్లేయటం పవన్‌కు బాగా అలవాటైపోయింది. మరి ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన షోకాజ్ నోటీసులోని అంశాలన్నీ తప్పుడువని పవన్ అనుకుంటున్నారా? తప్పో ఒప్పో ఏదో ఒకటి బహిరంగ ప్రకటన చేయాలని చంద్రబాబును పవన్ అడగవచ్చు కదా? మరెందుకు నోరెలేవటంలేదు?

Tags:    
Advertisement

Similar News