వాళ్లెవరు నన్ను కమాండ్‌ చేయడానికి..? - పవన్‌ ఫ్యాన్స్‌పై మండిపడ్డ రేణుదేశాయ్‌

త్వరలో కచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటానని రేణు దేశాయ్‌ స్పష్టం చేశారు. జీవితంలో సింగిల్‌ మదర్‌గా కొనసాగడం చాలా కష్టమని ఈ సందర్భంగా చెప్పారు.

Advertisement
Update:2023-10-24 12:53 IST

రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్‌ నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా, అందులో ఆమె పాత్ర గురించి ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌పై మండిపడ్డారు. పవన్‌ ఫ్యాన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. పవన్‌ గురించి మాట్లాడొద్దంటూ తనను హెచ్చరిస్తున్నారని వివరించారు. కొంతమంది పనిగట్టుకుని మరీ ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పారు. తనకు నచ్చినట్టు తాను ఉంటానని.. తనను ప్రశ్నించడానికి వాళ్లెవరని ఆమె ఈ సందర్భంగా మండిపడ్డారు. పవన్‌ గురించి తాను ఇష్టం ఉంటేనే మాట్లాడతానని, లేదంటే లేదని స్పష్టం చేశారు. అయినా తనను కమాండ్‌ చేయడానికి వాళ్లెవరంటూ పవన్‌ ఫ్యాన్స్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటా..

త్వరలో కచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటానని రేణు దేశాయ్‌ స్పష్టం చేశారు. జీవితంలో సింగిల్‌ మదర్‌గా కొనసాగడం చాలా కష్టమని ఈ సందర్భంగా చెప్పారు. తనకు పెద్దవాళ్ల సపోర్టు కూడా లేదని, తాను సింగిల్‌ గానే తన పిల్లలను పోషిస్తున్నానని వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదని, త్వరలో తాను కచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదని, అది వంద శాతం జరుగుతుందని తెలిపారు. కానీ తాను ఎక్కువగా ఆధ్యా గురించే ఆలోచిస్తున్నానని, అందుకే ఆ విషయంలో కొంత టైమ్‌ తీసుకుంటున్నానని రేణు చెప్పారు. ముందుగా తన బిడ్డలను సరైన క్రమంలో పెంచాలని, ఆ విధంగానే వారిని తయారు చేస్తున్నానని తెలిపారు. అలాగే గతంలో కూడా రేణు రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించిన సమయంలో పవన్‌ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ ఎలాంటిదో ఆమె స్వయంగా వివరించారు. అప్పట్లో.. రెండో పెళ్లి ఎందుకని అసభ్య పదజాలంతో ఆమెపై తెగబడటం, ఆమె పెళ్లి చేసుకుంటే పవన్‌ పరువు ఏం కావాలని ఫ్యాన్స్‌ కామెంట్లు చేయడం తెలిసిందే.


ఒక కామన్‌ వ్యక్తిగా కూడా పవన్‌ వైపు స్టాండ్‌ తీసుకోను..

పవన్‌ కల్యాణ్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారా ఈ సందర్భంగా రేణు దేశాయ్‌ని ప్రశ్నించగా, ఆయన గురించి ఈ ప్రశ్నే వద్దని చెప్పారు. ఆయన సీఎం అవుతారా లేదా అనేది తాను కోరుకోనని, ఆ విషయం దేవుడే డిసైడ్‌ చేస్తాడని తెలిపారు. తాను కనీసం ఒక కామన్‌ వ్యక్తిగా కూడా ఆయన వైపు స్టాండ్‌ తీసుకోనని రేణు దేశాయ్‌ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News