వివేకా లేఖలో ఏముంది? పెరిగిపోతున్న ఉత్కంఠ

చనిపోయే ముందు వివేకా రాసినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖలో ఏముంది? హత్య విచారణలో ఆ లేఖ ఎందుకంత కీలకంగా మారింది? అన్న ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సీబీఐ విచారణలోను, విచారణకు సిద్ధపడిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి పదేపదే లేఖను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Update:2023-03-13 12:35 IST

వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుండి ఒక లేఖ ప్రస్తావన వినిపిస్తునే ఉంది. చనిపోయే ముందు వివేకా రాసినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖలో ఏముంది? హత్య విచారణలో ఆ లేఖ ఎందుకంత కీలకంగా మారింది? అన్న ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సీబీఐ విచారణలోను, విచారణకు సిద్ధపడిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి పదేపదే లేఖను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఆ లేఖ విషయమై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.

వివేకా చనిపోగానే ఆ లేఖను అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తన దగ్గరే దాచిపెట్టుకున్నారట. ఆ తర్వాత సీబీఐకి అందించినట్లు అవినాష్ చెబుతున్నారు. ఆ లేఖలో ఏముందో బయటపెట్టాలని అవినాష్ ఎన్నిసార్లు అడిగినా సీబీఐ మాత్రం బయటపెట్టలేదు. మూడురోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో ఎంపీ దాఖలు చేసిన పిటీషన్లో కూడా ప్రత్యేకంగా లేఖ విషయాన్ని ప్రస్తావించారు. దాంతో జడ్జి ఆ లేఖ గురించి అడిగినప్పుడు అది తమ దగ్గరే ఉందని సీబీఐ అంగీకరించింది. దాంతో ఆ లేఖను కోర్టు ముందుంచమని జడ్జి ఆదేశించారు.

సోమవారం విచారణ సందర్భంగా సదరు లేఖను జడ్జికి సీబీఐ అందించబోతోంది. తర్వాతైనా ఆ లేఖలో ఏముందో బయటపడుతుందా? తన కుటుంబ సభ్యులు అంటే మొదటి భార్య, కూతురు, అల్లుడికి తనకు జరుగుతున్న గొడవలు, రెండో భార్య+కొడుకు పేరు మీద‌ ఆస్తుల బదలాయింపు తదితరాలన్నీ వివేకా రాశారని అవినాష్ చెబుతున్నారు. ఆ లేఖ బయటపడితే వివేకా హత్య మిస్టరీ వీడిపోతుందని కూడా అంటున్నారు.

మరింతటి కీలకమైన లేఖను సీబీఐ ఎందుకు ఇంతకాలం బయటపెట్టలేదో అర్థంకావటంలేదు. ఇన్ని సంవత్సరాలుగా కోర్టులో విచారణ జరుగుతున్నా ఎప్పుడూ సీబీఐ లేఖను చూపించలేదు. ఇప్పుడు అవినాష్ దాఖలు చేసిన పిటీషన్ కారణంగానే సీబీఐ ఆ లేఖను కోర్టు ముందుంచుతోంది. జడ్జి ఆదేశించారు కాబట్టే తప్పనిసరిగా సీబీఐ లేఖను కోర్టు ముందుంచబోతోంది. ఇంతటి కీలకమైన ఆ లేఖలో ఎలాంటి వివరాలున్నాయో, ఏ విషయాలు వెలుగు చూస్తాయో అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.

Tags:    
Advertisement

Similar News