సాయంత్రం టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం
తొక్కిసలాట ఘటనపై సమావేశం చర్చించనున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు.
Advertisement
తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఇందులో చర్చించనున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం చెక్కులు అందజేసే విషయంపై చర్చించనున్నారు. శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి వీటిని పంపిణీ చేసే విషయమై సమాలోచనలు చేయనున్నారు. ఈ మేరకు సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది.
Advertisement