సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తాం : చంద్రబాబు

నీళ్లు ఉంటే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు

Advertisement
Update:2025-01-14 17:23 IST

సేంద్రియ వ్యవసాయానికి తానే శ్రీకారం చుట్టినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సీఎం మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తాం. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యంవైపు చూస్తున్నాయి. మనం తినే ఆహారం ఎలాంటిదో తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. హెల్త్‌పై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లూ వేగంగా మారిపోతున్నాయి. చిరుధాన్యాలు, పండ్లసాగు పెరుగుతోంది’’ అని చంద్రబాబు అన్నారు.

ఈ ఏడాది గోదావరి, కృష్ణా నదీ జలాలు దాదాపు 6వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలు వాటిలో కేవలం 350 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగారని ఆయన తెలిపారు. నీళ్లు ఉంటే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండగకు నారావారిపల్లె వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Tags:    
Advertisement

Similar News