దిగివచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్
కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం.. సమ్మె విరమణ
Advertisement
వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎట్టకేలకు దిగివచ్చింది. 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉప సంహరించుకుంది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకే తమ ఉద్యోగాలు తొలగించిందని కాంట్రాక్టు కార్మికులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. వైజాగ్ రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో మంగళవారం సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో కార్మిక సంఘాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి. కొంతకాలంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లబడ్డాయి.
Advertisement