వివేకా హత్యకేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు

వివేకా హత్యకేసులో మొత్తం ఆరుగురు నిందితులు చంచల్ గూడ జైలులో ఉన్నారు. వారిని ఈరోజు సీబీఐ కోర్టులో హాజరు పరిచారు.

Advertisement
Update:2023-06-16 19:20 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్‌ ను సీబీఐ కోర్టు పొడిగించింది. ఈనెల 30 వరకు నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఆరుగురు ఈనెల 30 వరకు బయటకు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.

వివేకా హత్యకేసులో మొత్తం ఆరుగురు నిందితులు చంచల్ గూడ జైలులో ఉన్నారు. వారిని ఈరోజు సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్‌ను ఈనెల 30 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే వైఎస్ భాస్కర్ రెడ్డి తనకు బెయిల్ కావాలంటూ అభ్యర్థించారు. కానీ కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది, బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఇప్పుడు రిమాండ్ కూడా పొడిగించడంతో ఆయన ఈనెల 30వరకు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.

అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటంటే..?

అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా.. సుప్రీంకోర్ట్ లో ఆ వ్యవహారంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టులో సునీత స్వయంగా వాదనలు వినిపించడం విశేషం. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరారామె. అయితే ఈ వ్యవహారం ఇంకా తెగలేదు. అప్పటి వరకూ తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతారు. ప్రతి శనివారం అవినాష్ రెడ్డిని పిలిపించి సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. 

Tags:    
Advertisement

Similar News