రాజధానిగా విశాఖ కరెక్ట్‌.. జగన్‌ను సమర్థించిన లోకేష్‌ తోడల్లుడు

అప్పుల విషయంలోనూ భరత్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం హయాంలోనే అంటే 2014-19 మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 3.5 లక్షల కోట్లకు చేరిందన్నారు.

Advertisement
Update:2024-05-08 08:46 IST

ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌ అభిప్రాయంతో ఏకీభవించారు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి, నారా లోకేష్ తోడల్లుడు మెతుకుమిల్లి భరత్. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అమరావతిని లక్షల కోట్లు పెట్టి నిర్మించడం కష్టమన్నారు. గత ఐదేళ్లుగా జగన్‌ చెప్తున్న మాటలనే ఓ ఇంటర్వ్యూలో భరత్‌ చెప్పారు. ఏపీలో విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

ఇంతకీ భరత్ ఏమన్నారంటే..?

అమరావతిని డెవలప్‌ చేయాలంటే అందుకు అవసరమైన డబ్బు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదన్నారు భరత్. విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖ అభివృద్ధి వల్ల రాష్ట్రం కూడా వేగంగా డెవలప్ అవుతుందన్నారు. అమరావతిని డెవలప్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ చాలా అవసరమన్నారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేయదగిన పోజిషన్‌లో స్టేట్‌ గవర్నమెంట్‌ లేదన్నారు. అమరావతి అనేది ఒక 20 ఏళ్ల స్టోరీ అన్నారు. ఏపీకి విశాఖ గ్రోత్ ఇంజిన్‌గా ఉందన్నారు.

ఇక అప్పుల విషయంలోనూ భరత్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం హయాంలోనే అంటే 2014-19 మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 3.5 లక్షల కోట్లకు చేరిందన్నారు. భరత్‌ ఇంటర్వ్యూపై వైసీపీ స్పందించింది. అమరావతిపై తెలుగుదేశం చేతులెత్తేసినట్లేనని ట్వీట్ చేసింది. గత ఐదేళ్లుగా జగన్‌ చెప్తున్న మాటలనే భరత్‌ చెప్పారని స్పష్టం చేసింది. రాజధానిగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పోటీ పడగలిగింది విశాఖ మాత్రమేనని.. అందుకే వైజాగ్‌తో పాటు ఏపీ ప్రజలందరీ ఛాయిస్‌ జగనన్నే అంటూ ట్వీట్ చేసింది.

Tags:    
Advertisement

Similar News