ఏ ఒక్కరినీ వదిలిపెట్టను.. నేనంటే ఏంటో చూపిస్తా

జర్నలిస్ట్ లు గా ఉన్న కొంతమంది వెధవల్ని శిక్షించే విధంగా పార్లమెంట్ లో ఓ ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచన కూడా తనకు ఉందన్నారు విజయసాయిరెడ్డి.

Advertisement
Update:2024-07-15 11:45 IST

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతిపక్షంలో ఉన్న తాను ఏమీ చేయలేనని వారు అనుకుంటే పొరపాటేనన్నారాయన. ఒక ఆడబిడ్డను, ఆదివాసీ బిడ్డను బజారుకీడ్చి, తన ఎదుగుదలపై కూడా కుట్ర పన్ని తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారాయన. వంశీ కృష్ణ అనే వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు విజయసాయిరెడ్డి.


Full View

జర్నలిస్ట్ లు గా ఉన్న కొంతమంది వెధవల్ని శిక్షించే విధంగా పార్లమెంట్ లో ఓ ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచన కూడా తనకు ఉందన్నారు విజయసాయిరెడ్డి. అమానవీయకర రీతిలో, జుగుప్సాకరంగా.. మహా టీవీ ఛానెల్ లో ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేవారెవరూ లేరన్నారు. అధికారంలో ఉన్న సామాజిక వర్గానికి చెందిన వారయితే తాము భయపడతామా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా తనను ఎవరైనా కలిస్తే తప్పా అని అడిగారు విజయసాయిరెడ్డి. అలా కలిసినంత మాత్రాన సంబంధాలు అంటగట్టేస్తారా అని అన్నారు. జర్నలిస్ట్ లు కూడా చాలామంది వచ్చి తనను ప్లాట్లు అడిగారని, తాను చేయగలిగినంత చేశానన్నారు. మహిళా జర్నలిస్ట్ లకు తాను ప్లాట్లు ఇచ్చి ఉంటే, వారితో కూడా సంబంధాలు అంటగడతారా అని నిలదీశారు విజయసాయిరెడ్డి. వంశీ కృష్ణ అనేవాడు ఒక అమ్మా అబ్బకు పుట్టి ఉంటే, వాడు నిజంగా మనిషి అయి ఉంటే.. ఇలాంటి ఆలోచనలు చేసి ఉండేవాడు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ వంశీ.. నీకు అమ్మ, చెల్లి, అక్క అనేవారు లేరా.. వారిపై కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తే నువ్వు సైలెంట్ గా ఉంటావా..? అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

మహాన్యూస్ వంశీ కృష్ణ, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబ.. వీరి పుట్టుకపై తనకు అనుమానం ఉందని చెప్పారు విజయసాయిరెడ్డి. వారి తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్ట్ చేయించండని, వారి పుట్టుక సక్రమమేనా అని ఎవరైనా అడిగితే వారు బాధపడరా, లేదా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం కాదని.. సమాజానికి సేవ చేయడం ముఖ్యం అని అన్నారాయన.

పెద్ద కుట్ర..

మహా న్యూస్ వంశీ కృష్ణ వెనక ఎవరున్నారో తనకు తెలుసన్నారు విజయసాయిరెడ్డి. సాయిరెడ్డి తనకు తండ్రిలాంటి వారని సదరు ఆదివాసీ మహిళ చెప్పిందని.. కడుపుకి అన్నం తినేవారెవరూ తమపై అలాంటి నిందలు వేయరని, అలాంటి వార్తల్ని టెలికాస్ట్ చేయరని అన్నారు. రహస్యంగా విచారణ చేయాల్సిన కంప్లయింట్ ని మీడియాకు లీక్ చేసిన అధికారికి బుద్ధిలేదని, ఆ కంప్లయింట్ ని టెలికాస్ట్ చేసిన మీడియాకి కూడా బుద్ధి లేదన్నారు విజయసాయిరెడ్డి. నాలుగు ఛానెళ్లు మినహా మిగతా అన్ని ఛానెళ్లు కూడా ఈ కంప్లయింట్ ని ప్రసారం చేశాయన్నారు. మిగతా ఛానెళ్లన్నీ ఒకే సామాజిక వర్గానికి అనుకూలంగా పనిచేసేవని, న్యూస్ రీడర్లు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవని చెప్పారు. ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని, ఒక మహిళ క్యారెక్టర్ ని దెబ్బతీస్తారా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. 

త్వరలో తన ఆధ్వర్యంలో కొత్త న్యూస్ ఛానెల్ ప్రారంభించబోతున్నట్టు చెప్పారు విజయసాయిరెడ్డి. గతంలో తాను ఛానెల్ మొదలు పెడతానంటే జగన్ వారించారని, ఈసారి ఎవరు వద్దన్నా ఛానెల్ పెట్టి తీరతానన్నారు. రాజకీయ పక్షపాతం లేకుండా ఆ ఛానెల్ నడుపుతామన్నారు. 

Tags:    
Advertisement

Similar News