తుపాకీ పట్టుకోవాలా..? హోం మంత్రికి ఎంపీ విజయసాయి కౌంటర్

ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సహా టీడీపీ నేతలు.. అంతు చూస్తాం, పాదాలతో తొక్కేస్తాం అంటుంటే.. రాజకీయ కక్ష అనుకున్నామని, నిజంగానే వారు ఇంతటి హింసకు దిగజారుతారని అనుకోలేదన్నారు విజయసాయిరెడ్డి.

Advertisement
Update:2024-07-23 08:32 IST

టీడీపీ హత్యా రాజకీయాలతో ఏపీ ప్రజలతోపాటు పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోందని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ హోం మంత్రి తుపాకీ పట్టుకోవాలనడమేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సహా టీడీపీ నేతలు.. అంతు చూస్తాం, పాదాలతో తొక్కేస్తాం అంటుంటే.. రాజకీయ కక్ష అనుకున్నామని, నిజంగానే వారు ఇంతటి హింసకు దిగజారుతారని అనుకోలేదన్నారు విజయసాయిరెడ్డి.


ఎంతకాలం రావణ దహనం..?

టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలు వైసీపీ వారిని హతమారుస్తుంటే, ఆ ఘటనల గురించి మాట్లాడకుండా, హంతకులు కూడా వైసీపీ వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఏ పార్టీ వాళ్లయనా హత్యల్ని ఎలా సమర్దిస్తారని ప్రశ్నించారు. రెడ్ బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం.. అని ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి.

ఢిల్లీలో బిజీబిజీ..

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రేపు ఢిల్లీలో జరగబోయే వైసీపీ మహా ధర్నా కార్యక్రమ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు పార్యీ కార్యక్రమ ఏర్పాట్లు చూస్తూనే మరోవైపు పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలసి పలు విషయాలు చర్చించారు. ఇటు ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్లో ఘాటు సమాధానాలు చెబుతున్నారు విజయసాయిరెడ్డి.  

Tags:    
Advertisement

Similar News