వరదాపురం Vs పరిటాల.. అప్పుడే మొదలైందా..?

సూరికి టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు తమ రెండు టికెట్లలో ఒకటి కోత పెడుతున్నట్లు పరిటాల కుటుంబం మండిపోతోంది.

Advertisement
Update:2024-01-01 10:38 IST

తెలుగుదేశంపార్టీలో టికెట్ కోసం ఘర్షణలు మొదలైపోయినట్లుంది. దీనికి తాజా ఉదాహరణ అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇద్దరు నేతల మధ్య జరిగిన ఘర్షణే. నిజానికి ఘర్షణ రెండు వేర్వేరు పార్టీల నేతల మధ్యే జరిగినా ఇద్దరూ చంద్రబాబునాయుడుకు సన్నిహితులు కావటమే ఇక్కడ కీలకపాయింట్. ఇంతకీ విషయం ఏమిటంటే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీచేయటానికి రెడీ అవుతున్నారు. కాకపోతే ఏ పార్టీ అన్నదే తేలలేదు.

టీడీపీ, జనసేనతో పొత్తుంటే బీజేపీ అభ్యర్థిగానే పోటీలో ఉంటారు. లేకపోతే టీడీపీలో చేరి సైకిల్ గుర్తుపై పోటీచేస్తారు. ఈ మేరకు చంద్రబాబు నుంచి సూరికి హామీ దక్కిందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ధర్మవరం నుంచి పోటీచేయటానికి పరిటాల శ్రీరామ్ రెడీ అవుతున్నారు. గడచిన ఐదేళ్ళుగా శ్రీరామ్‌ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. రాప్తాడు నుంచి తల్లి పరిటాల సునీత, ధర్మవరం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే శ్రీరామ్ ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పరిటాల ఫ్యామిలీతో భేటీ అయిన చంద్రబాబు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకే టికెట్ ఇస్తానని చెప్పేశారట. దాంతో ఇప్పుడు పరిటాల కుటుంబం భగ్గమంటోంది. కారణం ఏమిటంటే.. సూరికి టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు తమ రెండు టికెట్లలో ఒకటి కోత పెడుతున్నట్లు పరిటాల కుటుంబం మండిపోతోంది. సరిగ్గా ఇదే సమయంలో న్యూఇయర్ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం ముదిగొబ్బ మండలంలో సూరి పేరుతో పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిల్లో సూరితో పాటు చంద్రబాబు, లోకేష్ ఫొటోలు ఉన్నాయి.

ఫ్లెక్సీలను చూడగనే మండిపోయిన శ్రీరామ్ మద్దతుదారులు వాటిని చింపేశారు. దాంతో రెండువర్గాల మధ్య పెద్ద ఘర్షణయ్యింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండువర్గాలను అదుపులోకి తీసుకోవాల్సొచ్చింది. సూరీని చంద్రబాబే ఎంకరేజ్ చేస్తున్నారన్నది శ్రీరామ్ మద్దతుదారుల ఆరోపణ. సూరిని టీడీపీలోకి చేర్చుకోవ‌ద్ద‌ని ఇప్పటికే పరిటాల ఫ్యామిలీ చంద్రబాబుతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సూరికి టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు తమ టికెట్లో కోత పెడుతున్నట్లు పరిటాల ఫ్యామిలీకి అర్థ‌మైపోయింది. మరి ఈ విషయం ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News