వల్లభనేని వంశీకి బిగ్‌ రిలీఫ్‌

ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఆ లోపు ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Advertisement
Update:2024-08-14 23:01 IST

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. వల్లభనేని వంశీపై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 20ల తేదీ వరకు వంశీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది కోర్టు. కక్షపూరితంగా కేసు పెట్టారని వంశీ తరపు లాయర్ వాదిస్తే.. దాడి వెనుక వంశీ ఉన్నారంటూ వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఆ లోపు ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. ఆఫీసులోని ఫర్నిచర్‌తో పాటు అక్కడ ఉన్న వెహికిల్స్‌ను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారంతా వల్లభనేని వంశీ అనుచరులేనన్నది ప్రధాన ఆరోపణ. ఇక వంశీ ఎక్కడ ఉన్నారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కొద్దిరోజులుగా ఏపీ పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News