ఉగాది వేడుకల్లో విషాదం.. 15 మంది చిన్నారులు క‌రెంట్ షాక్‌

ప్రభలు ఊరేగిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రభలకు విద్యుత్ తీగలు తగలడంతో 15 మంది పిల్లలకు కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో పిల్లలు స్పృహ కోల్పోయారు.

Advertisement
Update:2024-04-11 11:52 IST

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. తెలుగు వారికి తొలి పండుగ కావడంతో అంతా ఆనందోత్సాహాల నడుమ వేడుకలు నిర్వహించారు. అయితే కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆనందంగా సాగుతున్న ఉగాది వేడుకల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దీంతో ఒకరిద్దరు కాదు ఏకంగా 15 మంది చిన్నారులు ఆస్ప‌త్రిపాలయ్యారు.

ఉగాది సందర్భంగా కల్లూరు మండలం చిన్నటేకూరులో రథోత్సవం నిర్వహించారు. ప్రభలు ఊరేగిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రభలకు విద్యుత్ తీగలు తగలడంతో 15 మంది పిల్లలకు కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో పిల్లలు స్పృహ కోల్పోయారు. గాయాలైన చిన్నారుల్ని హుటాహుటిన కర్నూలు GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం చిన్నారులకు ప్రాణాపాయం ఏమీలేదని వైద్యులు తెలిపారు. చిన్నారులు అకస్మాత్తుగా కరెంటు షాక్‌​కు గురికావడంతో తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఉత్సవాలు జరిగేటప్పుడు స్థానికంగా ఉన్న అధికారులు పరిసరాలను ఓసారి పరిశీలించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News