కొడాలి నాని సీటు గల్లంతు.. ఎల్లో మీడియాలో హోరెత్తుతున్న ప్రచారం
రాజశేఖరరెడ్డి హయాం నుంచి వైఎస్ కుటుంబ వీరాభిమానిగా మండలి హనుమంతరావుకు గుడివాడలో పేరుంది. సౌమ్యుడిగా,పెద్దమనిషి అయిన రాజకీయ నేతగా ఉన్న ఆయనకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వొచని కథనాలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్‌పై ఈగ కూడా వాలనివ్వని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికే రాబోయే ఎన్నికల్లో టికెట్ లేదంట! ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందట! అందుకే నానిని పక్కనపెట్టి ప్రత్యామ్నాయంగా ఓ కాపు నేతను వైసీపీ రంగంలోకి దింపబోతుందట!.. ఎల్లో మీడియాలో రెండు, మూడు రోజులుగా తీవ్రస్థాయిలో సాగుతున్న ప్రచారమిది.
మండలి హనుమంతరావుకు టికెట్!
కొడాలి నానిపై నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్‌లోనే తీవ్ర వ్యతిరేకత ఉందని, సర్వేల్లోనూ వెనకబడ్డారని.. అందుకే సౌమ్యుడు, సీనియర్ నాయకుడు అయిన మండలి హనుమంతరావును గుడివాడ వైసీపీ క్యాండిడేట్‌గా జగన్ ప్రకటించబోతున్నారని టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఎవరీ హనుమంతరావు?
రాజశేఖరరెడ్డి హయాం నుంచి వైఎస్ కుటుంబ వీరాభిమానిగా మండలి హనుమంతరావుకు గుడివాడలో పేరుంది. సౌమ్యుడిగా,పెద్దమనిషి అయిన రాజకీయ నేతగా ఉన్న ఆయనకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వొచని కథనాలు వస్తున్నాయి.
సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం
ఈ నేపథ్యంలో గుడివాడలో వెలసిన పోస్టర్లు అక్కడ ఏదో జరుగుతోందనే భావన కలిగిస్తున్నాయి. గుడివాడకు రారాజు మా హనుమంతరావుకు వైసీపీ టికెట్ వస్తున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సీఎంవో నుంచి హనుమంతరావుకు పిలుపు వచ్చిందనీ ప్రచారంలోకి రావడం గమనార్హం. మొత్తానికి గుడివాడ టికెట్ చుట్టూ ఉన్న గుట్టును జగన్ ఎలా విప్పుతారో చూడాలి.