తడ వద్ద తీరం దాటిన వాయుగుండం

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు

Advertisement
Update:2024-10-17 08:25 IST

ఏపీలో వాయుగుండం తీరం దాటింది. తిరుపతి జిల్లా తడ వద్ద తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో కదిలి తీరాన్ని తాకినట్లు తెలిపింది. అనంతరం అల్పపీడనంగా బలహీనపడింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ జిల్లాలో ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి కెరటాలు భారీగా ఎగిసి పడుతున్నాయి. చెట్లు, స్తంభాలు, ఇంగ్లు నేలకూలాయి.

అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలం

కోనసీమ జిల్లా గోదావరి సముద్ర సంగమం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. అలలు బీచ్‌ రోడ్డును ముంచెత్తాయి. సముద్రపు నీళ్లు పల్లిపాలంలో ఇళ్లను చుట్టుముట్టాయి. ఓఎన్‌జీసీ ప్లాంటును తాకింది. ఆక్వా చెరువులను ముంచెత్తింది. 

సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు సీఎంకు వివరించారు. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులో నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.



Tags:    
Advertisement

Similar News