వైసీపీ ట్రాప్‌లో తెలుగుదేశం.. పథకాలే కాదు.. నినాదాలూ కాపీనే.!
తాజాగా సిద్ధం అని వైసీపీ ప్రకటిస్తే సంసిద్ధం అంటూ ఫ్లెక్సీలు కట్టింది తెలుగుదేశం. ఇక మా నమ్మకం నువ్వే జగన్ అంటూ గడపగడపకు స్టిక్కర్లు అంటిస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఫాలో అయింది.
తెలుగుదేశం పార్టీ వైసీపీ ట్రాప్‌లో పడిందా..? సొంత స్ట్రాటజీ లేక కాపీనే నమ్ముకుందా..? పరిస్థితులు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. సోషల్‌మీడియాలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ప్రజాదరణ పొందిన జగన్ పథకాలనే పేరు మార్చి తన మేనిఫెస్టోలో చేర్చింది. పథకాలే కాదు నినాదాలు కూడా కాపీ కొడుతోంది.
తాజాగా సిద్ధం అని వైసీపీ ప్రకటిస్తే సంసిద్ధం అంటూ ఫ్లెక్సీలు కట్టింది తెలుగుదేశం. ఇక మా నమ్మకం నువ్వే జగన్ అంటూ గడపగడపకు స్టిక్కర్లు అంటిస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఫాలో అయింది. మీరే మా గౌరవం అంటూ ఆ కార్యక్రమాన్ని టీడీపీ కాపీ కొట్టింది. జగనన్న మార్క్ పథకం అమ్మ ఒడి పథకాన్ని చంద్రన్న తెస్తున్న తల్లికి వందనం పేరుతో ఎత్తేసింది.
ఇక వైఎస్సార్ చేయూత పథకాన్ని ఆడబిడ్డ నిధి పేరుతో తెస్తామంటూ పలు సభల్లో ప్రకటించారు చంద్రబాబు. రైతు భరోసా పథకాన్ని అన్నదాత పేరుతో అమలు చేస్తామని చెప్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ పరోక్షంగా జగన్ పథకాలకు ప్రచారం చేస్తోందని.. తెలుగుదేశం అవలంబిస్తున్న పద్ధతి మేలు చేయకపోగా.. ఆ పార్టీకి జరిగే నష్టమే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం వైసీపీ ట్రాప్‌లో పడిపోయిందనడానికి ఇదే సాక్ష్యమని చెప్తున్నారు.