పగిలిన తలలు, ఎరుపెక్కిన చొక్కాలు.. రక్త తర్పణం జరగాల్సిందేనా..?

వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆ పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Update:2024-05-13 11:22 IST

ఏపీలో పోలింగ్ రోజు తలలు పగిలాయి, తోపులాటలు, గొడవలు ముదిరాయి. జీరో వయొలెన్స్ పోలింగ్ కోసం అంటూ ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితిలో మార్పు లేదు. అయితే ఎవరికి వారు తామే బాధితులం అన్నట్టు, ప్రత్యర్థి పార్టీ తమ వారి తలలు పగలగొట్టినట్టు ఆరోపించడం విశేషం.


ఏపీలో పలు చోట్ల టీడీపీ ఏజెంట్లపై దాడులు జరిగాయని, కిడ్నాప్ లు చేయడానికి ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో, పల్నాడు జిల్లా రెంట చింతల మండలంలో కూడా దాడులు జరిగాయని అంటున్నారు. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో కూడా ఘర్షణ జరిగింది. చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్‌ చేశారంటూ టీడీపీ, ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రకాశం జిల్లా కొండపిలో, సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కూడా దాడులు జరిగినట్టు టీడీపీ చెబుతోంది. ఎల్లో మీడియా ఈ ఘటనల తాలూకు కథనాలను హైలైట్ చేస్తోంది.


ఇటు వైసీపీ కూడా పలు చోట్ల తమ కార్యకర్తలపై దాడులు జరిగినట్టు చెబుతోంది. టీడీపీ ఓటమి భయంతో దాడులకు తెగబడుతోందని అంటున్నారు వైసీపీ నేతలు. చిత్తూరులో వైసీపీ ఏజెంట్ పై టీడీపీ గూండాలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చొన్న వైసీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నేతలుదాడి చేశారని, ఆయనకు రక్తగాయాలయ్యాయని అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆ పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తల వీడియోలు వైరల్ అవుతున్నాయి. 



Tags:    
Advertisement

Similar News