సంకెళ్లతో ముగిసిన ఫొటోషూట్

గతంలో పళ్లాలు మోగించడం, లైట్లు ఆర్పేయడం వంటి కార్యక్రమాల్లో కాస్తో కూస్తో ప్రజలనుంచి స్పందన ఉన్నా.. చేతికి తాళ్లు కట్టుకుని ఫొటోలు దిగడం మరీ సిల్లీగా ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అందుకే జనం దూరంగా ఉన్నారని అంటున్నారు. నాయకులే ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారు.

Advertisement
Update:2023-10-15 20:12 IST

చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా "న్యాయానికి సంకెళ్లు" అంటూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ముగిసింది. ఈరోజు రాత్రి 7గంటలకు మొదలైన ఈ కార్యక్రమం కాసేపట్లోనే పూర్తయింది. ఐదు నిమిషాలసేపు చేతికి తాళ్లు, రిబ్బన్లు కట్టుకుని, ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలన్న నారా లోకేష్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. సోషల్ మీడియాలో ఈ నయా నిరసన కార్యక్రమం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఈ ఫొటోల్ని వైసీపీ అకౌంట్లు విపరీతంగా ట్రోల్ చేయడం విశేషం.

చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కాస్త కామెడీగా ఉంటున్నాయి. మోతమోగిద్దాం, కాంతితో క్రాంతి అంటూ ఇప్పటికే రెండు ఎపిసోడ్ లు పూర్తయ్యాయి. న్యాయానికి సంకెళ్లు అంటూ చేపట్టిన మూడో ఎపిసోడ్ మరింత కామెడీని పంచింది. చేతికి తాళ్లతో టీడీపీ నేతలంతా ఫొటోషూట్ చేసి వెంటనే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. సామాన్య ప్రజలనుంచి స్పందన పెద్దగా లేదని తెలుస్తోంది. గతంలో పళ్లాలు మోగించడం, లైట్లు ఆర్పేయడం వంటి కార్యక్రమాల్లో కాస్తో కూస్తో ప్రజలనుంచి స్పందన ఉన్నా.. చేతికి తాళ్లు కట్టుకుని ఫొటోలు దిగడం మరీ సిల్లీగా ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అందుకే జనం దూరంగా ఉన్నారని అంటున్నారు. నాయకులే ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారు.

ఏం చేయాలి..? ఏం చేస్తున్నారు..?

చంద్రబాబు అరెస్ట్ అయితే అసలు లోకేష్ ఏం చేయాలి..? ఏం చేస్తున్నారు..? అనేదే అసలు ప్రశ్న. తండ్రిని జైలునుంచి బయటకు రప్పించే ప్రయత్నంలో లోకేష్ ఎక్కువరోజులు ఢిల్లీలోనే గడిపారు. ఇటీవలే ఆయనకు అమిత్ షా అపాయింట్ మెంట్ లభించినా కేంద్రం నుంచి కనీసం స్పందన కూడా లేదు. అమిత్ షా తనతో ఏదో చెప్పాడని లోకేష్ చెప్పుకోవడం మినహా అటునుంచి స్పందన లేకపోవడం విశేషం. తండ్రి కేసులు చూడాలో, తన కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు లోకేష్. మరోవైపు పార్టీ కార్యక్రమాలన్నీ ఎక్కడికక్కడ పడకేశాయి. జనసేనతో పొత్తు వ్యవహారంలో కేవలం ప్రకటనే కానీ, మరో ముందడుగు పడలేదు. చంద్రబాబు బయటకొస్తేనే ఏదైనా జరిగేది అన్నట్టుగా ఉంది టీడీపీ పరిస్థితి. ఇలాంటి టైమ్ లో నారా లోకేష్.. చిత్ర విచిత్రమైన పేర్లతో నిరసనలకు పిలుపునివ్వడం టీడీపీకి మరింత నీరసాన్ని తెప్పిస్తోందని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News