క‌ళ్లు మూసుకుపోతే ఇలాగే ఉంటుందా?

ఏపీ భవన్లో హెల్ప్ లైన్లు ఏర్పాటుచేసి విద్యార్థులు, తల్లిదండ్రులతో టచ్‌లో ఉంటోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మణిపూర్ నుండి తెలుగు విద్యార్థులను ఏపీకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎల్లో మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వటంలేదు.

Advertisement
Update:2023-05-08 12:01 IST

విషయం ఏదైనా, సందర్భం ఏదైనా కానీండి జగన్మోహన్ రెడ్డి పైన బురదచల్లేయటమే టీడీపీ టార్గెట్. అంతేకానీ ముందు వెనుక చూసుకోవటం అన్నదే ఉండదు. ఇప్పుడు విషయం ఏమిటంటే మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను రక్షించేందుకు జగన్‌కు మనసు రావటం లేదా అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. మణిపూర్‌లో ఉన్న తెలుగు విద్యార్థులను తీసుకురావటానికి జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం దుర్మార్గం అంటు కింజరాపు మండిపోయారు.

విషయం ఏమిటంటే మణిపూర్‌లో చదువుతున్న వందల మంది తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రంతో, మణిపూర్ ప్రభుత్వంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. అక్కడి విద్యార్థులందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన శాఖను కోరింది. ఇందుకు కేంద్రం అంగీకరించింది కూడా. ఏ సమయంలో ప్రత్యేక విమానం బయలుదేరుతుందనే విషయంతో పాటు ఏ విమానంలో తరలిస్తామనే విషయాన్ని కూడా సమాచారం ఇస్తామని పౌరవిమానాయాన శాఖ ప్రకటించింది. మొదటి విడతగా 160 మందిని తెచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసింది.

విద్యార్థులందరినీ ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు విమానాశ్రయం వరకు మిలిట‌రీ సెక్యూరిటి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మణిపూర్ ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేసింది. అందుకు మణిపూర్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇంతకన్నా జగన్ ప్రభుత్వం ఏం చేస్తోంది. ఏపీ భవన్లో హెల్ప్ లైన్లు ఏర్పాటుచేసి విద్యార్థులు, తల్లిదండ్రులతో టచ్‌లో ఉంటోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మణిపూర్ నుండి తెలుగు విద్యార్థులను ఏపీకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎల్లో మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వటంలేదు.

ఇదే సమయంలో ప్రభుత్వంపై ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలను మాత్రం బాగా హైలైట్ చేస్తోంది. దాంతో విషయం తెలిసినా కావాలనే జగన్ ప్రభుత్వంపై తమ్ముళ్ళు రెచ్చిపోయి బురదచల్లేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తోందంటే జగన్ ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వచ్చేస్తుందో అన్న బాధే ఎక్కువగా కనబడుతోంది. ఎలాగైనా ప్రభుత్వానికి జనాల్లో మంచిపేరు రాకూడదని తమ్ముళ్ళు, ఎల్లో మీడియా కూడబలుక్కునే ఇదంతా చేస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకోలేనంత అమాయకులా జనాలు? ఇది మీడియా యుగం కాదు సోషల్ మీడియా యుగమన్న విషయం చంద్రబాబు అండ్ కోతో పాటు ఎల్లో మీడియా మరచిపోయింది.

Tags:    
Advertisement

Similar News