జగన్ పిటిషన్ పై టీడీపీ సెటైర్లు...

గతంలో ఎలాంటి సెక్యూరిటీ ఉందో, అదే సెక్యూరిటీ కావాలంటున్నారు జగన్. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా సీఎం స్థాయి సెక్యూరిటీ ఇవ్వడం ఎలా సాధ్యమని టీడీపీ ప్రశ్నిస్తోంది.

Advertisement
Update:2024-08-06 07:43 IST

తనకు సెక్యూరిటీ పెంచాలంటూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన జగన్ పై టీడీపీ సెటైర్లు మొదలు పెట్టింది. గతంలో ఎవరూ ఇలా అర్హతకు మించి అదనపు సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్లలేదని, కానీ జగన్ మాత్రం తనకు సీఎం హోదాలో ఉన్నట్టుగా భద్రత కల్పించాలంటున్నారని టీడీపీ ట్వీట్ చేసింది. 900మందితో జగన్ తనకు భద్రత కావాలంటున్నారని ఒక ఎమ్మెల్యేకి ఇంత భద్రత అవసరమా అని ప్రశ్నించింది.


జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే అని, ఇప్పటికే ఆయన స్థాయికి మించి ఏపీ పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తోందని టీడీపీ అంటోంది. ఇప్పటికీ జగన్‌కు జడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ కి ఇస్తున్న భద్రత వివరాలతో ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీసు శాఖ అంటోంది. ప్రస్తుతం జగన్‌ కాన్వాయ్‌లో రెండు అత్యాధునిక ల్యాండ్‌ క్రూయిజర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఉన్నాయని తెలిపింది. జడ్‌ ప్లస్‌ కేటగిరిలో నేషనల్​ సెక్యూరిటీ గార్డుల అధీనంలో ఉన్న చంద్రబాబుకు బుల్లెట్‌ప్రూఫ్‌ ఫార్చునర్‌ వాహనం మాత్రమే ఉందని అంటున్నారు. హై కోర్టులో పిటిషన్ విచారణకు వస్తే ఈ వివరాలన్నీ తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

గతంలో ఇచ్చినట్టు రూ.300 కోట్లతో, 934 మంది రక్షణ ఇవ్వాలని జగన్ కోరుతున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు జగన్ మాత్రం తనకు ప్రాణ హాని ఉందని, కచ్చితంగా సెక్యూరిటీ పెంచాలంటున్నారు. గతంలో ఎలాంటి సెక్యూరిటీ ఉందో, అదే సెక్యూరిటీ కావాలంటున్నారు. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా సీఎం స్థాయి సెక్యూరిటీ ఇవ్వడం ఎలా సాధ్యమని టీడీపీ ప్రశ్నిస్తోంది. 

Tags:    
Advertisement

Similar News