హింటిచ్చేశారు.. టీడీపీ నెక్స్ట్ టార్గెట్ పెద్దిరెడ్డి

కూటమి అధికారంలోకి వచ్చాక, వైసీపీ నుంచి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు.

Advertisement
Update:2024-06-13 08:18 IST

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయని, అర్హత లేకపోయినా 400మందికి ఉద్యోగాలిచ్చి, పెద్ద మొత్తంలో జీతాలిచ్చారని తాజాగా ఎల్లో మీడియా హడావిడి చేస్తోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తోంది. ఆయన తనయుడు మిథున్ రెడ్డికి కూడా ఈ స్కామ్ లో భాగం ఉందంటూ వార్తలిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేయడం విశేషం.

కూటమి అధికారంలోకి వచ్చాక, వైసీపీ నుంచి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు. ముందుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు ఎక్కు పెట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల ట్రాన్స్ ఫర్ ల విషయంలో ఆయనకు ముడుపులు వెళ్లాయనేది ప్రధాన ఆరోపణ. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా బదిలీలు చేపట్టాలని చూశారని, చివరకు ముడుపులు ఇచ్చిన ఉపాధ్యాయులు కొంతమంది మోసపోయారంటూ కథనాలిచ్చారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరుని తెరపైకి తెచ్చి విమర్శలు సంధిస్తున్నారు.

టీడీపీ కక్షసాధింపు..

గతంలో స్కిల్ కేసులో చంద్రబాబుని జైలుకి పంపించారు. సీఐడీ విచారణ జరుగుతున్న సందర్భంలో టీడీపీలో చాలామంది ఆందోళనకు గురయ్యారు. అటు అమరావతి పేరుతో జరిగిన భూ సంతర్పణపై కూడా గత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుత మంత్రి నారాయణసహా మరికొందరిపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు టీడీపీకి టైమ్ వచ్చింది. మాజీ మంత్రులపై విచారణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముందుగా వారి అనుకూల మీడియా ద్వారా ఫలానా తప్పులు జరిగాయంటూ కథనాలు వచ్చేలా ప్లాన్ చేశారు. ఈ కక్షసాధింపులు లిస్ట్ లో ఇంకా ఎవరెవరున్నారు తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News