అసెంబ్లీలో టీడీపీ విజిల్స్.. వైసీపీ మంత్రుల ఘాటు రియాక్షన్

టీడీపీ నేతలు బజారు వెధవలంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. బజారు కూతలు కూస్తే బజారు వెధవలను వదిలిపెట్టేది లేదన్నారు.

Advertisement
Update:2023-09-22 12:27 IST

ఏపీ అసెంబ్లీ రెండో రోజు విజిల్స్ తో మారుమోగిపోయింది. టీడీపీ సభ్యులు రెండో రోజు కూడా ఫ్ల‌కార్డులు చేతబట్టుకుని స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. బేషరతుగా చంద్రబాబుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సైకో పాలన పోవాలంటూ నినాదాలు చేశారు.


Full View

బజారు కుక్కలు

టీడీపీ నేతలు బజారు కుక్కలు, వీధి కుక్కలు అంటూ మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో వారు అలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తాను సభలో ఇలాంటి మాటలు మాట్లాడటానికి చాలా ఆలోచించానని, కానీ టీడీపీ ప్రవర్తన సరిగా లేదన్నారు. కుక్కల్లా మొరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం.

సైకోగాళ్లు..

సైకో పాలన పోవాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి జోగి రమేష్ తిప్పికొట్టారు. సైకో పాలన ఆల్రడీ పోయిందని, సైకో చంద్రబాబు జైలులో ఉన్నాడని, సైకోగాళ్లంతా సభకు వచ్చి రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. బాబు బొక్కలో ఉన్నాడు, అర్థం చేసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జోగి రమేష్. బాలకృష్ణ వేసుకున్న కండువాపై ఎన్టీఆర్ ఫొటో ఉందని, ఆయన్ని పొట్టన పెట్టుకున్న వాళ్ల బావ సైకో 420 జైలులో ఉన్నాడని ఎద్దేవా చేశారు.

బజారు వెధవల్లారా..?

టీడీపీ నేతలు బజారు వెధవలంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. బజారు కూతలు కూస్తే బజారు వెధవలను వదిలిపెట్టేది లేదన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు దొంగ, దోషి, ఆయన ప్రజా ధనాన్ని దోచుకున్నారని సీఐడీ తేల్చిందని చెప్పారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, టీడీపీ ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాలన్నారు కాకాణి. అడుక్కుతినే అలవాటు మానుకోలేక చిల్లర కోసం టీడీపీ నేతలు సీటీలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. 


Tags:    
Advertisement

Similar News