టీడీపీ మీడియా కోఆర్డినేటర్ అరెస్ట్

సీఎంవోకు అంటగడుతూ చేసిన ప్రచారంలో ఇటీవల ఒక జర్నలిస్ట్‌ను కూడా సీఐడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన కోర్టు ఆదేశాలతో బయటకు వచ్చారు. ఇదే కేసులో ఇప్పుడు నరేంద్రను సీఐడీ అరెస్ట్ చేసింది.

Advertisement
Update:2022-10-13 08:29 IST

సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌భుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్న‌ కేసులో టీడీపీ నుంచి మరొకరి అరెస్ట్ జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా కో- ఆర్డినేటర్‌గా ఉన్న దారపునేని నరేంద్రను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో ఒక మహిళ వ‌ద్ద‌ బంగారం పట్టుబడగా.. సదరు మహిళ ఏపీ సీఎంవోలో కీలక అధికారి భార్య అంటూ ప్రచారం చేశారు.

ఇలా సీఎంవోకు అంటగడుతూ చేసిన ప్రచారంలో ఇటీవల ఒక జర్నలిస్ట్‌ను కూడా సీఐడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన కోర్టు ఆదేశాలతో బయటకు వచ్చారు. ఇదే కేసులో ఇప్పుడు నరేంద్రను సీఐడీ అరెస్ట్ చేసింది. ఎయిర్‌పోర్టులో పట్టుబడిన మహిళ.. సీఎంవోలో ఏ అధికారి కుటుంబ సభ్యురాలు కాకపోయినా తప్పుడు పోస్టులు సృష్టించి వాటిని వైరల్ చేయడంలో దారపునేని నరేంద్ర కీలక పాత్ర పోషించారని సీఐడీ చెబుతోంది.

బుధవారం సాయంత్రం గుంటూరు అరండల్‌పేటలోని అతడి నివాసంలో నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర అరెస్ట్‌ను నిరసిస్తూ సీఐడీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. నరేంద్రకు మద్దతుగా టీడీపీ మాజీ మంత్రులు కూడా సీఐడీ కార్యాలయం వద్ద బైఠాయించారు. నరేంద్ర భార్యకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే నేరుగా ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందని అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News