తమ్ముళ్ళ ట్రోలింగ్‌పై వెరీ సీరియస్.. హిస్టరీ రిపీట్స్

ట్రోలింగ్ చేసిన 27 మందికి వెంటనే నోటీసులు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది. హైకోర్టు సీరియస్ అయినవారిలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.

Advertisement
Update:2023-09-28 10:23 IST

జడ్జీలపై దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగటంపై హైకోర్టు బాగా సీరియస్ అయ్యింది. ట్రోలింగ్ చేసిన 27 మందికి వెంటనే నోటీసులు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది. హైకోర్టు సీరియస్ అయినవారిలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక‌ప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పిన జడ్జీలపై కొందరు వైసీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ట్రోలింగ్ చేసి కోర్టు ఆగ్రహానికి గురైన విషయం గుర్తుండే ఉంటుంది.

అప్పట్లో 40 మందిని గుర్తించి వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని అప్పట్లో సీఐడీని హైకోర్టు ఆదేశించింది. వారిలో కొందరిని సీఐడీ అరెస్టు కూడా చేసింది. అయితే ఇంకా కొందరు మిగిలే ఉన్నారన్న కారణంగా సీఐడీపై మండిపడిన హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియ‌దు. ఆ ట్రోలింగులపై ఎల్లోమీడియా అప్పట్లో గంగవెర్రులెత్తిపోయింది. న్యాయవ్యవస్థ‌పై జగన్మోహన్ రెడ్డి దండయాత్రని, వైసీపీ యుద్ధమని ఏదేదో రాసేసింది.

సీన్ కట్ చేస్తే సేమ్ టు సేమ్ అప్పుడు ఏమి జరిగిందో ఇప్పుడు అదే జరిగింది. అప్పుడు వైసీపీ వాళ్ళయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళంతే. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేస్తే ఏసీబీ కోర్టు రిమాండు విధించింది. తనపైన నమోదైన కేసులను కొట్టేయాలని చంద్రబాబు క్వాష్ పిటీషన్ దాఖలు చేస్తే దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ కోర్టు రిమాండు విధించడాన్ని, క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని తమ్ముళ్ళు, చంద్రబాబు మద్దతుదారులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే జడ్జీలను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. బుర్రకు తోచినట్లు కామెంట్లు పెడుతు చాలా అసభ్యంగా ట్రోల్‌ చేస్తున్నారు.

ఈ ట్రోలింగ్‌పై హైకోర్టు లాయర్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ప‌రిశీలించిన‌ రాష్ట్రపతి భవన్ .. వెంటనే విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలని ఏపీ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుని హైకోర్టులో పిటీషన్ వేసింది. దానిపై విచారణ జరిపిన కోర్టు ట్రోలింగులు, పోస్టింగులను చూసింది. వెంటనే 27 మందికి నోటీసులు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది. మరి నోటీసులు అందుకున్న తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    
Advertisement

Similar News