వ్యక్తిగతంగానూ జగన్ మూల్యం చెల్లించుకుంటాడు
పాముకు తలలో మాత్రమే విషం ఉంటుందని.. జగన్‌కు శరీరమంతా విషం ఉందన్నారు. జగన్‌పై చాలా కేసులు ఉన్నా ట్రయల్ కూడా జరగడం లేదన్నారు.
జగన్ తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు చంద్రబాబు జోలికి రావడమేనని వ్యాఖ్యానించారు నారా లోకేష్. ఇందుకు జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. తన తండ్రి పెళ్లి రోజు నాడే జైలుకు పంపారని.. చివరకు కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు మరికొంత సమయం కావాలన్నా ఇవ్వలేదన్నారు.
తమకు మద్దతుగా నిలిచిన ''నేను అన్నగా భావించే పవన్ కల్యాణ్‌కు'' ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పాముకు తలలో మాత్రమే విషం ఉంటుందని.. జగన్‌కు శరీరమంతా విషం ఉందన్నారు. జగన్‌పై చాలా కేసులు ఉన్నా ట్రయల్ కూడా జరగడం లేదన్నారు. వివేకా హత్య కేసు విచారణ ముందుకు వెళ్లడం లేదన్నారు. దీన్ని బట్టే వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.
చంద్రబాబు విచారణకు సంబంధించిన వీడియో, జైలు లోపలికి వెళ్లిన తర్వాత వీడియోను బయటకు తెచ్చారని.. కేవలం కించపరచడం కోసమే ఇలా చేశారన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ సైకోయిజం ఏ స్థాయిలో ఉందో ప్రజలకు అర్థమైంది. ఒక ప్రతిపక్ష నాయకుడిని జైలుకు పంపితే మంత్రులు సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఇందిరా గాంధీతోనే పోరాటం చేసిన పార్టీ తమదని, జగన్ ఒక లెక్క కాదన్నారు. ప్రస్తుత పరిస్థితి ఒక స్పీడ్ బ్రేక్ మాత్రమేనని ఎలా ముందుకెళ్లాలో తమకు తెలుసన్నారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తే భద్రత కల్పించడం కష్టమవుతుందని ఎన్‌ఎస్‌జీ కమాండోలు చెప్పడంతోనే చంద్రబాబు నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చారన్నారు. ఈ ఎపిసోడ్ ముగిసిన తర్వాత యువగళం యాత్ర మళ్లీ ప్రారంభిస్తానని చెప్పారు.