టీడీపీ మరో ఫేక్ ప్రచారం.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు
ఈ విషయం వైసీపీ దృష్టికి రావడంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది.
ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది ఫేక్ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోంది. తాజాగా ఏపీ ఎన్నికలపై ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టు పేరుతో ఓ ఫేక్ పోల్ సర్వేను వాట్సాప్‌తో పాటు ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సర్క్యూలేట్ చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో తప్పుడు ప్రచారంతో ఓటర్లను ప్రభావితం చేయాలనే కుట్రలకు తెరలేపింది.
అయితే ఈ విషయం వైసీపీ దృష్టికి రావడంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న సర్వే రిపోర్టును నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఓటర్లు టీడీపీ ట్రాప్‌లో పడొద్దని సూచించింది వైసీపీ.
నిన్నటివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ. ఈ అంశంపై టీడీపీ ఫేక్ ప్రచారాన్ని వైసీపీ గట్టిగా తిప్పికొట్టింది. ఈ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లగా.. ఏపీ సీఐడీ చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌లపై కేసు నమోదు చేసింది. ఇక ఇప్పుడు ఫేక్ సర్వేలను సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సర్క్యూలేట్ చేస్తోంది టీడీపీ.