బాబుకి జైలు గ్యారెంటీ..! సిట్ పై నమ్మకం ఉందన్న వైసీపీ

సిట్ ఏర్పాటుపై సుప్రీంతీర్పుతో వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది. చంద్రబాబు పాపాలు పండాయని అంటున్నారు వైసీపీ నేతలు. ఇన్ సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందని చెబుతున్నారు.

Advertisement
Update:2023-05-03 18:26 IST

ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగించినప్పుడు కచ్చితంగా సమీక్ష జరగాల్సిందేనన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసే విషయంలో తాము కక్షపూరితంగా వ్యవహరించలేదని, సబ్ కమిటీ ఏర్పాటు చేసి, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే సిట్ ఏర్పాటు చేశామన్నారు. అమరావతి భూదందా నిజం అని చెప్పడానికి ఇప్పుడు మార్గం సుగమం అవుతుందన్నారాయన. ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్ అవ్వొచ్చన్నారు. అరెస్ట్ చేస్తే వేధింపులు, చెయ్యకపోతే ధైర్యం లేదంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, దర్యాప్తులో అన్నీ తెలుస్తాయని చెప్పారు సజ్జల.

ఇక మంత్రి రోజా కూడా సిట్ పై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు. తప్పులు చేసి స్టే లు తెచ్చుకుంటూ చంద్రబాబు రోజులు నెట్టుకొచ్చారని, సుప్రీంకోర్టు తీర్పు ఒక విజయం అని చెప్పారు. చంద్రబాబు పాపాలు పండాయని, ఆయన జైలుకి వెళ్ళి చిప్పకూడు తినే రోజులు దగ్గరపడ్డాయని శాపనార్థాలు పెట్టారు. లోకేష్, చంద్రబాబు ఇచ్చిన సూట్ కేసులు లెక్కపెట్టిన భువనేశ్వరి లెక్కలు తేలే సమయం దగ్గరపడిందని చెప్పారు.

సిట్ ఏర్పాటు విషయంలో హైకోర్టు విధించిన స్టేని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. సిట్ ఏర్పాటుపై సుప్రీంతీర్పుతో వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది. చంద్రబాబు పాపాలు పండాయని అంటున్నారు వైసీపీ నేతలు. ఇన్ సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందని చెబుతున్నారు. సిట్ విచారణ ఎలా జరుగుతుంది, చివరకు ఏం తేలుతుందో ఇప్పుడే ఊహించలేం కానీ, వైసీపీ నేతల వ్యాఖ్యలతో టీడీపీకి భయం పట్టుకోవడం గ్యారెంటీ అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News