అసలు కేసును ఏంచేద్దామని అనుకుంటున్నారు..?
సునీత భర్త, బావే సాక్ష్యాధారాలను చెరిపేయాలని తమకు చెప్పినట్లు సీబీఐకి గంగిరెడ్డి చెప్పారని జగన్ మీడియా చెప్పింది. అంటే నిందితులు ఒకలాగ చెబుతుంటే సీబీఐ కోర్టులో మరోలాగ ఎందుకు వాదిస్తోందో అర్థంకావటంలేదు.
సునీతారెడ్డి వైఖరే అర్థం కావటంలేదు. ఒకవైపేమో తండ్రి వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు శిక్షపడే వరకు పోరాటం చేస్తానని ప్రతిజ్ఞచేశారు. మరోవైపేమో హత్యచేసిన వాళ్ళతో భేటీలకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సునీత వైఖరంతా గందరగోళంగా ఉంది. హైదరాబాద్ లోని చంచలగూడ జైల్లో ఉన్న గంగిరెడ్డితో భేటీఅయ్యేందుకు సునీత ప్రయత్నించటమే ఆశ్చర్యంగా ఉంది. గంగిరెడ్డంటే తండ్రి హత్య నిందితుల్లో ఏ-1. ఏ-1ను కలవాలని సునీత ప్రయత్నంచేస్తే అందుకు జైలు అధికారులు అంగీకరించలేదట.
అందుకనే తన లాయర్ ద్వారా గంగిరెడ్డితో మాట్లాడించారు. మరి గంగిరెడ్డికి సునీత ఏమి సమాచారం పంపారో గంగిరెడ్డి ఏమని సమాధానమిచ్చారో తెలీదు. అయితే జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రకారం తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి అనుకూలంగా సీబీఐ, కోర్టు విచారణలో మాట్లాడాలని కబురుచేశారట. వివేకా మర్డర్ తర్వాత ఆధారాలను చెరిపేయమని తమకు సునీత భర్త, బావలే చెప్పినట్లుగా సీబీఐకి గతంలోనే గంగిరెడ్డి చెప్పారు. దాన్నే ఇప్పుడు మార్చి చెప్పాలని లాయర్ ద్వారా కబురుచేసినట్లు సమాచారం.
హత్య తర్వాత సాక్ష్యాధారాలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఆదేశాల ప్రకారం నిందితులు చెరిపేసినట్లు కోర్టులో సీబీఐ వాదిస్తోంది. సునీత భర్త, బావే సాక్ష్యాధారాలను చెరిపేయాలని తమకు చెప్పినట్లు సీబీఐకి గంగిరెడ్డి చెప్పారని జగన్ మీడియా చెప్పింది. అంటే నిందితులు ఒకలాగ చెబుతుంటే సీబీఐ కోర్టులో మరోలాగ ఎందుకు వాదిస్తోందో అర్థంకావటంలేదు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. వివేకాను హత్యచేసినట్లు అంగీకరించిన దస్తగిరికి సునీత మద్దతుగా ఉన్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎవరైనా తనతండ్రిని చంపిన వాళ్ళను జైల్లో పెట్టమని, శిక్షించాలని డిమాండ్ చేస్తారు. కానీ ఇక్కడ సునీత మాత్రం రివర్సులో దస్తగిరిని రక్షిస్తున్నారు. దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని వివేకాకు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు. వెంటనే సునీత మరో పిటీషన్ వేసి దస్తగిరి బెయిల్ రద్దుచేయాల్సిన అవసరంలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా కృష్ణారెడ్డి పిటీషన్నే కొట్టేయమని అడిగారు. ఒకవైపు దస్తగిరిని రక్షిస్తూ మరోవైపు గంగిరెడ్డికి రాయబారాలు పంపుతున్న సునీత అసలు తన తండ్రి హత్యకేసును ఏమిచేద్దామని అనుకుంటున్నారో అర్థం కావటంలేదు.