తూతూ మంత్రంగా నివాళులు.. జగన్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

సిద్ధం సభల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైసీపీ, పార్టీపరంగా కనీసం వైఎస్ఆర్ నివాళి సభ కూడా నిర్వహించలేదని మండిపడ్డారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సభ ఏర్పాటు చేశామని, ఆయనకు ఘన నివాళులర్పించామని చెప్పుకొచ్చారు.

Advertisement
Update:2024-07-12 19:41 IST

వైఎస్ఆర్ 75వ జయంతిని నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ జగన్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనీసం తండ్రి సమాధి వద్ద జగన్ 5 నిమిషాలు ఉండలేకపోయారని, తూతూ మంత్రంగా నివాళులర్పించారని విమర్శించారు. పేపర్ పై, ప్రకటనల్లో వైఎస్ఆర్ ఫొటో ఉండటం కాదని, ఆయన్ని గుండెల్లో పెట్టుకోవాలని చెప్పారు. సిద్ధం సభల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైసీపీ, పార్టీపరంగా కనీసం వైఎస్ఆర్ నివాళి సభ కూడా నిర్వహించలేదని మండిపడ్డారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సభ ఏర్పాటు చేశామని, ఆయనకు ఘన నివాళులర్పించామని చెప్పుకొచ్చారు.

షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. వైఎస్ఆర్ మరణించి 15 ఏళ్లవుతున్నా.. ఏనాడూ ఆయన జయంతి, వర్థంతిని కాంగ్రెస్ పార్టీ నిర్వహించలేదంటూ ట్విట్టర్లో సమాధానమిచ్చింది. వైఎస్ఆర్ ని విమర్శించిన నేతలతో జట్టుకట్టి, షర్మిల రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలంటున్నారు. ఇన్నేళ్లలో షర్మిల కూడా ఎప్పుడూ వైఎస్ఆర్ జయంతి, వర్థంతిని నిర్వహించలేదని విమర్శించారు. వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్న కూటమి నేతల్ని షర్మిల ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు.


ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఆ పార్టీకి శత్రువైన బీజేపీకి అనుకూలంగా, బీజేపీతో కలసి ఉన్న టీడీపీకి అనుకూలంగా షర్మిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న కూటమిని ప్రశ్నించాల్సిందిపోయి, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని ఇరుకున పెట్టాలని షర్మిల భావిస్తున్నారని చెప్పారు. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు పేర్ని నాని. 



Tags:    
Advertisement

Similar News