ఇంతమంది సీనియర్లు తప్పుకుంటున్నారా?

రాబోయే ఎన్నికల్లో తాము పోటీ నుండి తప్పుకుంటున్నట్లు చాలామంది సీనియర్లు ఇప్పటికే జగన్‌కు చెప్పేశారు. తమకు బదులుగా తమ వారసులకు టికెట్లు కేటాయించాలని రిక్వెస్ట్‌ చేశారు.

Advertisement
Update:2023-01-24 11:09 IST

వచ్చే ఎన్నికల్లో పోటీ నుండి అధికార పార్టీలో చాలా మంది సీనియర్లు తప్పుకుంటున్నట్లే కనబడుతోంది. మాజీ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్నిస్తున్నాయి. పార్టీ నేతలతో బాలినేని మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకు కాకుండా తన భార్య సచీదేవికి ఇస్తానంటే చేసేదేమీ లేదు తప్పుకోవాల్సిందే కదా అని అన్నారు. ఇక్కడే నిప్పులేనిదే పొగరాదు అనే సామెతను అందరు గుర్తు చేసుకంటున్నారు. బహుశా శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేదిలేదని జగన్ చెప్పారా లేదా తాను పోటీ చేయటం లేదని జగన్‌కు మాజీ మంత్రి చెప్పేశారా అనే చర్చ మొదలైపోయింది.

రాబోయే ఎన్నికల్లో తాము పోటీ నుండి తప్పుకుంటున్నట్లు చాలామంది సీనియర్లు ఇప్పటికే జగన్‌కు చెప్పేశారు. తమకు బదులుగా తమ వారసులకు టికెట్లు కేటాయించాలని రిక్వెస్ట్‌ చేశారు. మచిలీపట్నంలో తనకు బదులు తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి పేర్ని నాని చేసిన రిక్వెస్ట్‌ను జగన్ రిజ‌క్ట్‌ చేశారు. పేర్ని కొడుక్కి టికెట్ అడగటం జగన్ కాదనటం అందరి ముందే జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా జగనే చెప్పారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకం కాబట్టి ఈసారికి వారసులు కాకుండా సిట్టింగులే పోటీ చేయాలని జగన్ చెప్పేశారు.

అయితే చాలామంది సీనియర్లు కన్విన్స్ కావటంలేదు. ధర్మాన సోదరులు ప్రసాదరావు, కృష్ణదాసు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి కాకుండా మరో పది మంది తమ వారసులకు టికెట్లు ఇవ్వమని గట్టిగానే అడుగుతున్నారు. ఇలాంటి వారిలో చెన్నకేశవరెడ్డి, రఘురామిరెడ్డి వారసులకు మాత్రమే జగన్ ఓకే చెప్పారని పార్టీలో టాక్. అయినా మిగిలిన సీనియర్లు వారసుల విషయంలో జగన్‌ను కలుస్తూనే ఉన్నారు.

ఎందుకంటే వయసు అయిపోవటం, అనారోగ్య కారణాల వల్ల జగన్ కాదనలేకపోయారట. ఎన్నికల నాటికి ఇంకెంత మంది వారసులకు టికెట్లు ఇవ్వాలని పట్టుబడతారో తెలీదు. జగన్ గనుక ఒత్తిళ్ళకు లొంగిపోతే వైసీపీలో చాలామంది సీనియర్లు ఒక్కసారిగా తెరమరుగైపోవటం ఖాయం. తాము పోటీ చేసినా వారసులకు టికెట్లిచ్చినా గెలుపు ప్రయత్నాల్లో అయితే లోటుండదు. అయితే అసెంబ్లీలో ప్రత్యర్థుల‌ను ఎదుర్కోవటంలో తేడా వచ్చేస్తుంది. అందుకే వచ్చే ఎన్నికల వరకు సీనియర్లే పోటీ చేయాలని జగన్ గట్టిగా చెబుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News